కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన సమంత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Sep 2020 12:33 PM GMT
కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన సమంత

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో అక్కినేత సమంత ఒకరు. పెళ్లి తరువాత కూడా సమంత డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికి కూడా దర్శక నిర్మాతలు ఆమె కాల్పీట్ల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంది. ఒక గొప్ప ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదగాలన్నదే ఆమె కల. ఇప్పటికే ఆ దిశగా సామ్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే తన స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ లో 'ఏకం' అనే ప్రీస్కూల్ ను ప్రారంభించింది. తాజాగా ఆమె ప్రారంభించబోయే కొత్త వ్యాపారం గురించి చెప్పింది. చిన్న నాటినుంచి తనకున్న కలను సాకారం చేసుకునేందుకు తాజాగా ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోకి దిగుతున్నానని సమంత పేర్కొంది.

సాకీ వరల్డ్ పేరుతో ఔట్ లెట్లను హైదరాబాద్ నగరంలో ప్రారంభించనున్నారట. దీనికోసం నెలలుగా కలలు కంటున్నానని సమంత వెల్లడించారు. ఇందులో ధరలు అందుబాటులో ఉంటాయని తనకు ఫ్యాషన్ విషయంలో ఉన్న ప్రేమతోనే ఈ ఔట్ లెట్ ని ప్రారంభిస్తున్నానని ట్విట్టర్ లో సమంత తెలిపింది. ‘సాకీ ఫైనల్‌గా వచ్చింది. ఇది నా బిడ్డలాంటిది.. దీని కోసం ఎన్నో కలలు కన్నాను.. ఫ్యాషన్ పట్ల నాకున్న ప్రేమకు నిదర్శనమే ఇది. నా సినిమా కెరీర్ ప్రారంభించకుముందు నుంచే ఫ్యాషన్ ప్రపంచం, మ్యాగజైన్‌లతో నా జీవితం ముడిపడి ఉంది’ అని సమంత వెల్లడించింది. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తున్న సామ్ తదుపరి నిర్మాతగానూ మారనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.Next Story