హీరోయిన్‌ ధరించిన డ్రెస్‌ ఆమెకు చిక్కులు తెచ్చింది. సామాజిక కార్యకర్తలం అంటూ కొందరూ కన్నడ హీరోయిన్‌ సంయుక్త హెగ్డేపై దాడి చేశారు. బెంగ‌ళూరులోని ప‌బ్లిక్ పార్క్‌లో ఫ్రెండ్‌తో క‌లిసి వ‌ర్క‌వుట్స్ చేస్తున్న సమయంలో ఆమెపై సామాజిక కార్య‌క‌ర్త‌ల‌మంటూ ప‌ది మంది యువ‌కులు దాడికి పాల్ప‌డ్డారు. ప‌బ్లిక్ పార్క్‌లో అసభ్య‌క‌ర‌ దుస్తులు ధ‌రించి ఇలా చేయ‌డం ఏంట‌ని హీరోయిన్‌ను మంద‌లించ‌డంతో వివాదానికి తెర‌లేపింది. ప్ర‌తిరోజూ పార్క్‌లో ఆమె అభ్యంత‌ర‌క‌ర దుస్తుల‌తో వ‌ర్క‌వుట్స్ చేస్తున్న‌ట్టు కొంద‌రి ఫిర్యాదు మేర‌కు వారు అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.

క‌న్న‌డ హీరోయిన్‌తో ఆ యువ‌కుల‌కు మాటామాటా పెరిగింది. ప‌రిస్థితి చేయి దాటిపోతున్న స‌మ‌యంలో పోలీసుల రంగ‌ప్ర‌వేశంతో స‌ద‌రు హీరోయిన్ క్షేమంగా బ‌య‌ట‌ప‌డింది. తనపై దాడి చేయడానికి వచ్చిన వారిని వీడియో ద్వారా చూపించింది. ” స్పోర్ట్స్ బ్రా ధ‌రించ‌డం నేరమా, ఇదేనా ఇండియాలో మాకున్న స్వేచ్ఛ‌, స్వాతంత్ర్యాలంటూ అంటూ “ప్ర‌శ్నించారు. పోలీసులు సంయుక్త‌తో పాటు సామాజిక కార్య‌క‌ర్త‌లని వ‌చ్చిన వారిని స్టేష్‌న్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. కాగా.. సంయుక్త తెలుగులో నిఖిల్‌తో కిర్రాక్ పార్టీ చిత్రంలో నటించింది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *