డిగ్రీ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్‌ రాసిన టాలీవుడ్ సీనియ‌ర్‌ నటి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sept 2020 5:00 PM IST
డిగ్రీ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్‌ రాసిన టాలీవుడ్ సీనియ‌ర్‌ నటి

చదువుకోవాలనే ధృడ సంక‌ల్పం ఉండాలే గానీ.. వ‌య‌స్సు, స్థాయి అనేవి చాలా చిన్న విష‌యాలు అని నిరూపించారు సినీ నటి హేమ. టాలీవుడ్‌లో న‌టిగా రాణిస్తున్న ఆమె.. చ‌దువుకోవాల‌నే త‌న క‌ల‌ను సాక‌రం చేసుకోబోతున్నారు. వివ‌రాళ్లోకెళితే.. డిగ్రీ చ‌దవాల‌నుకున్న సినీ నటి హేమ.. అంబేద్క‌ర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

అయితే.. ఇందుకు సంబంధించి అర్హత పరీక్షను ఆదివారం నల్లగొండలోని హౌసింగ్ బోర్డు కాల‌నీలో గ‌ల‌ ఎన్జీ కళాశాలలో ఆమె రాశారు. పరీక్ష రాసిన‌ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎప్పటినుంచో డిగ్రీ చేయాలని అనుకుంటున్నాని.. అందులో భాగంగానే హైదరాబాద్‌లో ప‌రిస్థితుల దృష్ట్యా నల్లగొండలో పరీక్ష రాసినట్టు ఆమె తెలిపారు. అలాగే ఎవరైనా గుర్తు పట్టినా.. పరీక్ష ఏకాగ్ర‌త‌గా రాయడం కష్టమవుతుందనే నల్లగొండలో పరీక్ష రాస్తున్నాన‌న్నారు.

అంతేకాకుండా.. హైదరాబాద్‌లో కోవిడ్ కేసులు, ట్రాఫిక్ తదితర ఇబ్బందులు ఉండటంతో న‌ల్గొండ‌లో పరీక్ష రాయ‌డానికి మ‌రో కార‌ణంగా చెప్పారు. అంతేకాకుండా న‌ల్గొండ‌లో తమకు బంధువులు కూడా ఉన్నారని చెప్పారు. ఇదిలావుంటే.. తాను ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నానని.. నల్లగొండ ఫిల్మ్ సిటీకి దగ్గరగా ఉంటుంద‌ని ఆమె అన్నారు.

Next Story