అక్టోబర్‌ 1 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్‌..!

By సుభాష్  Published on  27 Sep 2020 7:32 AM GMT
అక్టోబర్‌ 1 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్‌..!

కరోనా మహమ్మారితో లాక్‌డౌన్‌ కారణంగా సినిమా హాళ్లు మూతపడ్డాయి. అన్‌లాక్‌లో భాగంగా దాదాపు అన్నింటికి అనుమతులు ఇచ్చినా.. సినిమా హాళ్లకు మాత్రం ఇంకా అనుమతి రాలేదు. అన్‌లాక్‌లో భాగంగా ప్రభుత్వం ఒక్కొక్కటిగా సలిడలిస్తున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 1 నుంచి సినిమా టాకీసులు, థియేటర్లు తిరిగి తెరుచుకోవచ్చని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 50 మందికి మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఈ మేరకు మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. కరోనా నియంత్రణలో భాగంగా మార్చి 23న దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. దీంతో గత ఆరు నెలలుగా థియేటర్లు మూసే ఉన్నాయి. సీఎం మమతా నిర్ణయంతో 1 నుంచి థియేటర్లు తెరుచుకోనున్నాయి. వీటితో పాటు అన్ని మ్యూజికల్‌, డ్యాన్సింగ్‌ ఈవెంట్స్‌, మ్యాజిక్‌ షోలను అనుమతిస్తామని పేర్కొన్నారు.

అయితే భౌతిక దూరం, మాస్కులు ధరించడం, కోవిడ్‌ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2 లక్షల 44వేలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 3వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

Next Story