రాకింగ్ స్టార్ యశ్ కుమారుడి నామకరణం.. ఏమని పేరు పెట్టారంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sept 2020 6:59 PM IST
రాకింగ్ స్టార్ యశ్ కుమారుడి నామకరణం.. ఏమని పేరు పెట్టారంటే..!

కేజీఎఫ్ సినిమా ద్వారా దేశంలోని సినీ అభిమానులు తన వైపు చూసేలా చేశాడు రాకింగ్ స్టార్ యశ్. భారీ కటౌట్ తో.. గుబురు గెడ్డంతో అదిరిపోయే మ్యాచో లుక్స్ తో రాకీ భాయ్ గా చేసిన యాక్టింగ్ అదిరిపోయింది. ఎప్పుడెప్పుడు కేజీఎఫ్ పార్ట్-2 వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

యశ్ పర్సనల్ లైఫ్ గురించి కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. యశ్ తనతో పాటూ సీరియల్స్, సినిమాలో కలిసి నటించిన రాధిక పండిట్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కన్నడ చిత్ర పరిశ్రమలో హ్యాపీయెస్ట్ కపుల్స్ లో వీరు కూడా ఒకరు. 2016 లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆర్య అనే కుమార్తె ఉంది. అక్టోబర్ లో ఈ దంపతులకు కుమారుడు పుట్టాడు. ఆ పిల్లాడికి ఇటీవలే నామకరణం చేశారు. తన కుమారుడికి 'యాత్రవ్' అనే పేరును పెట్టారు.

యశ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో నామకరణం ఘట్టానికి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. యశ్, రాధికా పండిట్ లు పూజలో కూర్చుని ఉన్నారు. యశ్, రాధిక, కుమార్తె ఆర్య పేర్లు కలిసేలా యాత్రవ్ అనే పేరు పెట్టామని యశ్ తన అభిమానులకు తెలిపాడు. యశ్, రాధికలు సోషల్ మీడియాలో తమ బిడ్డలకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేస్తూ ఉంటారు.

యశ్ నటించిన కేజీఎఫ్ పార్ట్-2 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తీ అయింది. గత ఏడాది మార్చిలో రెండో భాగం షూటింగ్ మొదలవ్వగా.. అక్టోబర్ 23న చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా ఆ తేదీన రిలీజ్ అవ్వడం కష్టమేనని చెబుతున్నారు. ఈ మధ్యనే సినిమాకు సంబంధించిన మిగిలిన షూటింగ్ పూర్తీ చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావించాడు. కేజీఎఫ్-2లో ప్రకాష్ రాజ్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నట్లు ఫోటోలు ఇటీవల విడుదలయ్యాయి. రావు రమేష్, రవీనా టాండన్ లు కీలక పాత్రల్లో నటిస్తూ ఉండగా.. సంజయ్ దత్ విలన్ గా నటిస్తూ ఉన్నాడు.

Next Story