Fact Check : షబానా అజ్మీ కూడా పొరపాటు పడ్డారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 May 2020 5:43 PM IST
Fact Check : షబానా అజ్మీ కూడా పొరపాటు పడ్డారా..?

సుప్రసిద్ధ సినీ యాక్ట్రెస్ షబానా అజ్మీ తన ట్విట్టర్ అకౌంట్ లో ఇద్దరు పిల్లలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇద్దరు వలస కూలీల పిల్లలు ఉన్న ఫోటో అని.. అందులో చిన్న పిల్లాడు తన కంటే వయసులో పెద్దవాడైన వ్యక్తిని హత్తుకుని ఉన్నాడు. దీనిపై ఆమె 'హార్ట్ బ్రేకింగ్' అంటూ కామెంట్ పెట్టారు. దేశంలో ప్రస్తుతం వలస కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. సొంత ఊళ్లకు వెళుతూ ఉన్న కార్మికుల కష్టాలను చూస్తూనే ఉన్నాం. కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ ఫోటో కూడా ప్రస్తుతం తీసిన ఫోటో అనుకుని నటి షబానా అజ్మీ ట్వీట్ చేశారు.



షబానా అజ్మీ ట్వీట్ చేసిన తర్వాత News18 Bengali edition కూడా ఈ విషయంపై ఆర్టికల్ ను బెంగాలీ భాషలో రాశారు. వలస కార్మికుల దీన స్థితిని చూసి షబానా అజ్మీ చలించి పోయారంటూ అందులో రాశారు. ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్లాలని అనుకుంటూ ఉన్నారోనని ఆ ఆర్టికల్ లో రాశారు. పలువురు ఈ ఫోటోను తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు.

నిజమెంత:

వలస కార్మికుల పిల్లలకు సంబంధించిన ఫోటోలు అంటూ వైరల్ అవుతున్న ఫోటో భారత్ కు చెందినది కాదు.

ఈ ఫోటోను గూగుల్ లోనూ యాండెక్స్ లోనూ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. గత సంవత్సరం నుండి చాలా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ లోనే కాదు చివరికి టిక్ టాక్ లో కూడా ఈ ఫోటో కనిపించింది.



S1



‘nusgram.com’ లో కూడా ఈ ఫోటోను షేర్ చేశారు. “The rich are busy many times for longing for the House of God … While Allah Taala and His Messenger miss the rich who love to donate and shelter the orphans and the poor. #abjmalaysia #actmalaysia # abj431 # act431” అంటూ అందులో పోస్టు చేశారు. ఈ ఫోటో మలేషియా దేశానికి చెందినదని తెలుస్తోంది. అది కూడా ఎనిమిది నెలల కిందట అక్కడి వెబ్ సైట్స్ లో పేద పిల్లల పరిస్థితి ఎలా ఉందో వివరించారు. మలేషియాలో ధనికులు పేదలకు అండగా ఉండాలని అందులో రాసుకుని వచ్చారు. ‘lobakmerah.com’ లో కూడా జూన్ 13, 2019న ఈ ఫోటో గురించి ఆర్టికల్ ను రాసుకొని వచ్చారు. 'http: //www.buctranhvancau.com/’ వెబ్ సైట్ లో జనవరి 28, 2019 న ఈ ఫోటోపై కవిత్వాలను కూడా రాశారు.

నిజమేమిటంటే: షబానా అజ్మీ పోస్టు చేసిన ఈ ఫోటో భారత్ కు చెందినది కాదు.

Claim Review:Fact Check : షబానా అజ్మీ కూడా పొరపాటు పడ్డారా..?
Claim Fact Check:false
Next Story