విషాదంలో సినీ ఇండస్ట్రీ : షూటింగ్ స్పాట్ లో కుప్పకూలి నటుడు మృతి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Sept 2020 6:42 PM ISTమలయాళ సనీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రబీష్ చక్కలక్కల్(44) సోమవారం షూటింగ్ స్పాట్ లో మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల అవగాహన నిమిత్తం ఓ టెలీ షూట్‌లో పాల్గొన్న ప్రబీష్ షూటింగ్ స్పాట్‌లో కుప్పకూలిపోయాడు.
అత్యవసర చికిత్స కోసం ప్రబీష్ ను ఆస్పత్రికి తరలించేందుకు ఆ ప్రాంతంలో ఉన్న కార్లను ఆపే ప్రయత్నం చేసినా ఎవరూ ఆపలేదని.. కొద్ది సేపటికి ప్రబీష్ కార్లోనే ఆస్పత్రికి తరలించినట్లు సిబ్బంది తెలిపారు. ఆస్పత్రికి తరలించే మార్గం మధ్యలోనే అతను మరణించినట్లు మాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు తెలిపారు.
ఇదిలావుంటే.. ప్రబీష్ పలు టెలీ ఫిల్మ్స్‌లో నటించడంతో పాటు పలు చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేశారు. తన తండ్రి జోసఫ్, భార్య జాన్సీ, కూతురు తనియలతో కలిసి ప్రబీష్ జీవిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం జరుగనున్నట్లు తెలుస్తోంది.