కర్నూల్‌లో యాసిడ్ దాడి కలకలం.. యువకుడిపై ప్రేయసి యాసిడ్ దాడి
By తోట వంశీ కుమార్ Published on 4 Sep 2020 5:40 AM GMTకర్నూల్ జిల్లా నంద్యాలలో యాసిడ్ దాడి కలకలం రేగింది. ప్రేమించిన వాడు తనను కాదని మరో యువతిని వివాహం చేసుకున్నాడనే కోపంతో.. ప్రేయసి ప్రియుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. 20 రోజుల వ్యవధిలో రెండో సారి ఆయువతి యాసిడ్ దాడి చేయడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. నంద్యాల మండలం పెద్దకొట్టాలలో ప్రేమించి పెళ్లి చేసుకోలేదంటూ నాగేంద్ర అనే వ్యక్తిపై ఓ యువతి యాసిడ్ పోసింది. నాగేంద్రకు 20 రోజుల క్రితమే వివాహం జరిగింది. దీంతో తనపై కోపం పెంచుకున్న యువతి వారం క్రితం ఓసారి యాసిడ్ దాడికి ప్రయత్నించగా.. స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. తాజాగా మరోసారి ఆ యువతి యాసిడ్ దాడి చేయటంతో ఆ యువకుడి ఒంటిపై గాయాలయ్యాయి. వెంటనే అతడిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. కులాంతర వివాహానికి పెద్దలు ఒప్పుకోరనే కారణంతో ఆ యువకుడు ప్రేమించిన అమ్మాయిని కాదని, పెద్దలు కుదర్చిన సంబంధం చేసుకున్నట్లు తెలుస్తోంది.