అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2020 12:57 PM GMT
అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

మాజి మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ను శుక్రవారం ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం బెయిల్‌ ఇవ్వలేమని తెలిపింది. దీంతో హైకోర్టును ఆశ్రయించాలని అచ్చెన్నాయుడు భావిస్తున్నారు. ఇప్పటికే తనను ప్రైవేట్‌ ఆస్పత్రించాలని కోరుతూ అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈఎస్‌ఐ కొనుగోళ్ల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు ఆరోగ్యం నిలకడగా ఉండడంతో బుధవారం సాయంత్రం ఆయన్ను డిశ్చార్జి చేశారు. ఆ తరువాత విజయవాడలోని జిల్లా జైలుకి తరలించారు.ఈ నేపథ్యంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు ఆయన లేఖ రాశారు. కొలనోస్కోపీ పరీక్షా ఫలితాలు ఇంకా రాలేదు కాబట్టి తనకు కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరారు. లేదంటే జైలులోకి అనుమతించరని అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. అచ్చెన్నాయుడి ఆరోగ్యం కుదుటపడనప్పటికి ఆయన్ను అక్రమంగా డిశ్చార్జి చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

Next Story
Share it