ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ పొడిగింపు.. కారణం అదేనా.!

By అంజి  Published on  7 April 2020 10:17 PM IST
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ పొడిగింపు.. కారణం అదేనా.!

అమరావతి: ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 5 వరకూ ఏబీపై ఉన్న సస్పెన్షన్‌ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సివిల్‌ సర్వీస్‌ అధికారుల సస్పెన్షన్‌ రివ్యూ కమిటీ నివేదిక ఆధారంగా ఈ సస్పెన్షన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏబీ వెంకటేశ్వర రావు.. 2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యురో చీఫ్‌గా తన అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలతో ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు తొలగించిన విషయం తెలిసిందే.

AB Venkateswara rao suspension Extension

ఏబీ తన సస్పెన్షన్‌పూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను కూడా ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్‌ కొట్టివేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావును ఇప్పటి వైసీపీ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఏబీ వెంకటేశ్వరరావు తన హయాంలో ఏరో స్టాట్, డ్రోన్లు తదితర పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

ఏబీ వెంకటేశ్వరరావు 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేస్తున్న ఆయన్ను ఎన్నికల సంఘం ఆదేశాలతో అప్పట్లో బదిలీ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనకు చాలా కాలం పాటు పోస్టింగ్ దక్కలేదు. ఆ తర్వాత ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Next Story