అయోధ్య రామిరెడ్డి తనయుడి వివాహ వేడుకలో సీఎం జగన్‌

By అంజి
Published on : 3 Feb 2020 9:38 AM IST

అయోధ్య రామిరెడ్డి తనయుడి వివాహ వేడుకలో సీఎం జగన్‌

అమరావతి: వైసీపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త అయోధ్యరామిరెడ్డి కుమారుడి వివాహా వేడుకకు సీఎం వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం జగన్‌ ఆశీర్వదించారు. వివాహానికి సీఎం జగన్‌తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారు. అయోధ్య రామిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత సోదరులు. 2014 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అయోధ్యరామిరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.

Aayodhyarami reddys son wedding Aayodhyarami reddys son wedding Aayodhyarami reddys son wedding Aayodhyarami reddys son wedding

సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ విశాఖపట్నం వెళ్లనున్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవానికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి 9.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయల్దేరి 10.10 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10.40 గంటలకు చినముషిడివాడలోని శారదా పీఠానికి వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు శారదా పీఠం వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.10 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం చేరుకుంటారు.

Next Story