ఒక్క పిక్‌తో ఆ సినిమా ఎలా ఉంటుందో చెప్పేసిన వర్మ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Oct 2019 1:00 PM IST
ఒక్క పిక్‌తో ఆ సినిమా ఎలా ఉంటుందో చెప్పేసిన వర్మ..!

ఈ ఒక్క పిక్ చాలు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ఎలా ఉంబడోతుందో చెప్పడానికి. కచ్చితంగా ఈ సినిమాలో వర్మ చంద్రబాబు, వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ను ఉతికి ఆరేయబోతున్నాడు అనుకోవచ్చు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అతనిని పెట్టిన ఇబ్బందులు, దానికి చంద్రబాబు ఎవరెవరి సాయం తీసుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను చంద్రబాబు ఏ విధంగా వాడుకున్నాడు అనేది ప్రముఖంగా వర్మ చూపిస్తారని ఈ పిక్ ద్వారా అర్ధం చేసుకోవచ్చు. జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ తన పార్టీ బలాన్ని పెంచుకోవడం కంటే కూడా..టీడీపీకి సాయపడిన విధానాన్ని వర్మ'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో చూపిస్తారని టాక్. ఈ పిక్ చేస్తుంటే టాలీవుడ్ టాక్ నిజమేనని అనిపిస్తుంది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర, పాదయాత్ర, ఆయన ప్రజలతో మమేకమైన తీరు, ఆయన సహనం, ఓపిక, పట్టుదలను వర్మ కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారని చెప్పుకుంటున్నారు.







Next Story