హైద‌రాబాద్: హ‌య‌త్‌న‌గ‌ర్ ప‌రిధిలో క‌న్న‌త‌ల్లినే ప్రియుడితో క‌లిసి కూతురు కిరాత‌కంగా హ‌త‌మార్చింది. రామ‌న్న‌పేట‌కు చెందిన ప‌ల్లెర్ల శ్రీనివాస్‌రెడ్డి లారీ డ్రైవ‌ర్‌. భార్య ర‌జిత క‌లిసి ప‌దేళ్ల కింద‌ట న‌గ‌రానికి వ‌ల‌స వ‌చ్చారు. మున‌గ‌నీర్‌లో నివాసం ఉంటున్నారు. ఒక్క‌తే కూతురు కీర్తి. సొంత ఇల్లు క‌ట్టుకున్నాడు. డిగ్రీ సెకండియ‌ర్ చ‌దువుతున్న కీర్తి ప‌క్క కాల‌నీకి చెందిన యువ‌కుడితో ప్రేమ‌లో ప‌డింది. ఈవిష‌యం తెలిసిన త‌ల్లిదండ్రులు యువకుడి పేరెంట్స్‌తో మాట్లాడి పెళ్లి కుదిర్చారు. త్వ‌ర‌లోనే పెళ్లి. అయితే కీర్తి మాత్రం ఇంటి పక్క‌నే ఉండే శ‌శితో ల‌వ్‌లో ప‌డింది. ఈ ల‌వ్ కూడా కంటిన్యూ చేసింది. దీంతో ఈ ట్రయాంగిల్ ల‌వ్ ఎపిసోడ్ తెలిసిన త‌ల్లి మంద‌లించింది. దీంతో త‌ల్లిపై కోపం పెంచుకున్న కీర్తి… త‌న ల‌వ‌ర్ శ‌శికి విష‌యం చెప్పింది.

ర‌జిత‌ను చంపితే త‌మ ప్రేమ‌కు అడ్డు తొలుగుతుంద‌ని భావించిన శశి…కీర్తిన చంపేలా ప్రోత్స‌హించాడు. త‌మ ప్రేమ‌కు అడ్డుగా ఉంద‌ని ఆమెను తొల‌గిస్తే…తాము పెళ్లి చేసుకోవచ్చ‌ని నూరిపోశాడు. శ్రీనివాస్‌రెడ్డి, ర‌జిత‌ల‌కు ఒకే కూతురు కీర్తి. దీంతో ఆమె ఆస్తిపై క‌న్నేసిన శశి… ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడ‌ని తెలుస్తోంది. శశి,కీర్తిల ల‌వ్‌స్టోరీ తెలిసిన ర‌జిత కూతురుని వారించింది. శ‌శిని తీవ్రంగా మంద‌లిచింది. దీంతో ర‌జిత‌పై క‌క్ష పెంచుకున్న శ‌శి… ఆమెను అడ్డు తొల‌గించేందుకు ప్లాన్ వేశాడు. అందులో భాగంగా కూతురు సాయంతో కీర్తిని చంపేశాలా ప్లాన్ చేసి హ‌త్య చేశాడు. మొత్తానికి ల‌వ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌లో ప్రేమికుడు శ‌శి, కూతురు కీర్తిలు జైలు ఊచ‌లు లెక్క‌బెట్టే ప‌రిస్థితి వ‌చ్చింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.