వరంగల్‌: 9 మంది హత్యకు ఆ మహిళనే కారణం..వెలుగు చూసిన మరో కొత్త కోణం!

By సుభాష్  Published on  25 May 2020 7:21 AM GMT
వరంగల్‌: 9 మంది హత్యకు ఆ మహిళనే కారణం..వెలుగు చూసిన మరో కొత్త కోణం!

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన వరంగల్‌ జిల్లాలోని గొర్రెకుంట 9 మంది హత్య కేసు 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. 9 మంది వలస కార్మికులు బుధవారం రోజు గొర్రెకుంట బావిలో శవాలై కనిపించారు. రంగలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో రోజురోజుకు కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. వారి పోస్టుమార్టం రిపోర్టులు, ఫోరెన్సిక్‌ నివేదికలు, లభించిన కాల్‌డేటా, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ల ఆధారంగా పోలీసులు కేసు మిస్టరీని చేధించారు. మృతుల్లో ఓ మహిళ అయిన బుస్రాతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సంజయ్‌కుమారే హత్య చేశాడని తేలింది. అయితే పోలీసులు విచారణ వేగవంతం చేసి లోతుగా దర్యాప్తు చేపట్టగా, సంజయ్‌ కుమార్‌ తానే 9 మందిని చంపేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. అయితే వీరిని చంపేందుకు సంజయ్‌కుమార్‌కు మరో ఇద్దరు సహకరించినట్లు తేలింది. అయితే ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది.

కాగా, 9 మందిని హత్యకు మక్సూద్‌ సమీప బంధువు మహిళనే కారణంగా తెలుస్తోంది. గత కొంత కాలంగా మక్సూద్‌ బంధువు మహిళ కనిపించకపోవడంతో మరికొన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. కొన్ని రోజుల నుంచి ఆ మహిళ కనిపించకపోవడంతో అనుమానంతో వివరాలు తెలుపాలని సంజయ్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు మక్సూద్‌ కుటుంబీకులు. వారు సంజయ్‌ను ఒత్తిడి చేయడంతో ప్లాన్‌ ప్రకారమే ఈ 9 మందిని చంపేసినట్లు తెలుస్తోంది. కాగా, మక్సూద్‌ సమీప బంధువు మహిళను కూడా సంజయ్‌ కుమారే హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ మహిళను సంజయే హత్య చేసినట్లు మక్సూద్‌ కుటుంబీకులకు అనుమానం వచ్చి నిలదీయడంతో .. మక్సూద్‌ కుటుంబంతో పాటు బుస్రా వివాహేతర సంబంధంలో జోక్యం చేసుకుంటున్న బీహార్‌కు చెందిన మరో ఇద్దరు యువకులను కూడా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. సంజయ్‌ మొత్తం 10 మందిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ 9 మందిని కూల్‌డ్రింగ్‌లో మత్తు మందు కలిపి బావిలో పడేశాడు సంజయ్‌కుమార్‌. వీరిని హత్య చేసేందుకు సంజయ్‌కి మరో ఇద్దరు యువకులు సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా, నిందితులను సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఘటన జరిగిన 48 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేధించారు.

కాగా, మక్సూద్‌ కుటుంబం పశ్చిమబెంగాల్ నుంచి వరంగల్‌లోని కరీమాబాద్‌కు 20 ఏళ్ల క్రితం వలస వచ్చింది. గొర్రెలకుంటలోని గోనెసంచీల ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా కరీమాబాద్‌ నుంచి రావడం ఇబ్బందిగా ఉండటంతో మక్సూద్‌ కుటుంబం ఫ్యాక్టరీలోనే ఉంటోంది. ఇక అదే ఆవరణలో శ్యామ్‌, శ్రీరామ్‌ అనే బీహార్‌కు చెందిన యువకులు ఉంటున్నారు.

బుధవారం రోజు మక్సూద్‌ కుటుంబం కనిపించకుండా పోవడంతో ఫ్యాక్టరీ యజమాని సంతోష్ చుట్టుపక్కల గాలించగా, ఓ బావిలో శవాలు కనిపించాయి. ముందుగా నాలుగు శవాలు బయటపడగా, తర్వాత మరో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. శ్యామ్‌, శ్రీరామ్‌ యువకులతో పాటు మక్సూద్‌ ఇద్దరు కుమారుల శవాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మక్సూద్‌ కూతురు బుస్రా వరంగల్‌లోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, భర్తతో విడిపోయిన బుస్రా తన మూడేళ్ల కుమారుడితో వారి వద్దనే ఉంటోంది. వీరితో పాటు గన్నీ సంచుల గోదాం పక్కనే ఉన్న పై అంతస్తులో బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యామ్‌లు అనే యువకులు కూడా ఉన్నారు. ఇక నగరంలోని సంజయ్‌కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తితో బుస్రాం వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో మక్సూద్‌ ఇంట్లో తరచూ గొడవలు కూడా జరిగేవని సమాచారం. అయితే మక్సూద్‌కు చెందిన సమీప బంధువు కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన మక్సూద్‌.. సంజయ్‌ను నిలదీశాడు. దీంతో అసలు నిజం బయటపడింది.

Next Story