భారత్‌లో ఒక్క రోజే 88 కరోనా కేసులు..

By అంజి  Published on  26 March 2020 8:53 PM IST
భారత్‌లో ఒక్క రోజే 88 కరోనా కేసులు..

హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌.. భారత్‌లో విజృంభిస్తోంది. క్రమ క్రమంగా కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒక్క రోజే దేశ వ్యాప్తంగా కొత్తగా కోవిడ్‌-19 కేసులు 88 నమోదు అయ్యాయి. గడిచిన రోజుల్లో కంటే అత్యధికంగా ఇవాళే కరోనా కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు భారత్‌లో మొత్తం కరోనా కేసులు సంఖ్య 694కు చేరింది.



దేశంలో కరోనా వైరస్‌ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 16కి చేరింది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనాతో మహారాష్ట్రలో ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. ఈ మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 45 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో 124, కేరళలో 118 మంది కరోనా బాధితులు ఉన్నారు.

తెలంగాణలో 44 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 11 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇవాళ విజయవాడలో స్వీడన్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా నిర్దారణ అయ్యింది. ఇప్పటి వరకు 360 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 327 మందికి కరోనా లేదని నిర్దారణ అయ్యింది. మిగత వారి వైద్య పరీక్షల రిపొర్ట్‌ రావాల్సి ఉంది.

Next Story