తెలంగాణలో భయంకరంగా పెరుగుతున్న కేసులు.. నేడు కొత్తగా 872 కేసులు
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Jun 2020 3:47 PM GMTతెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3189 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 872 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక కరోనాతో 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 8674 కేసులు నమోదు కాగా, 217 మంది మృతి చెందారు.
ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీలో 713 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 107 కేసులు, మేడ్చల్ జిల్లాలో 16 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా తెలంగాణలో అత్యధికంగా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర కలవరం చెందుతున్నారు.
ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 4005 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్ కాగా, ప్రస్తుతం 4452 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 274 మంది డిశ్చార్జ్ అయ్యారు.