విశాఖ ఏజెన్సీలో కలకలం.. విషాహారం తిని 70 మందికి అస్వస్థత
By తోట వంశీ కుమార్ Published on 9 July 2020 1:11 PM ISTవిశాఖ ఏజెన్సీలో పుడ్ పాయిజన్ కలకల రేపింది. కలుషిత ఆహారం తిని 70 మందికి అస్వస్థతకు గురైయ్యారు. జి.మాడుగుల మండలంలోని గడుతురు పంచాయతీ మలకపాలెంలో ఈ ఘటన జరిగింది. మాంసాహారం తిన్న గ్రామస్థులు ఒక్కసారిగా విరేచనాలతో అస్వస్థతకు గురైయ్యారు. బుధవారం సాయంత్రం గ్రామస్థులు మాంసాన్ని పంచుకున్నారు. రాత్రి భోజనం తరవాత వారికి ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు అయ్యాయి. దాంతోవారిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం 70 మంది బాధితులకు మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో పాడేరు ఆస్పత్రికి తరలించారు. వీరంతా చనిపోయిన పశు మాంసాన్ని తిన్నట్లు వైద్యులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కొట్టగూలీ భాగ్యలక్ష్మీ ఆస్పత్రి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.