జమ్ముకశ్మీర్‌ కుల్గాం జిల్లాలో జరిగిన వేర్వేరు కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లా లోయర్‌ ముందాలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకోగా, ఏడుగురు ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ అధికారులు అధికారికంగా వెల్లడించారు.

కాగా, ప్రస్తుతానికి ఒక మృతదేహం మాత్రమే లభ్యమైందని చెప్పారు. భారత సైన్యం, సీఆర్పీఎఫ్‌ పోలీసులు సంయుక్తంగా తీవ్ర వాదుల కోసం గాలింపు చేపట్టారు. ఈ మేరకు నిర్భంధ తనిఖీలు చేపట్టాయి. ముందే పసిగట్టిన పోలీసులు కాల్పులు జరిపారు. ఇక అంతకు ముందు కుల్గాంలోని గుడ్డెర ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.