ఐదుగురు భారతీయులను అపహరించిన చైనా ఆర్మీ..!
By తోట వంశీ కుమార్ Published on 5 Sept 2020 11:20 AM ISTలడఖ్ లోని భారత్-చైనా సరిహద్దులలో ఉద్రికత్తలు కొనసాగుతున్ననేపథ్యంలో అయిదుగురు భారతీయ పౌరులను చైనా సైన్యం అపహరించిందంటూ.. అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్ ఆరోపించారు. అపహరణకు గురైన అరుణాచల్ ప్రదేశ్ వాసులను వెంటనే విడిపించాలని కోరుతూ ఆయన ప్రధాని మోడీకి ట్విట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబానాసిరి జిల్లాకు చెందిన ఐదుగురు స్థానికులను చైనా సైన్యం ఎలాంటి సమాచారం లేకుండా అపహరించిందన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వారి జాడ ఇంతవరకు తెలియలేదన్నారు. ఈ మేరకు నిన్నాంగ్ ఎరింగ్ నేరుగా ప్రధాని కార్యాలయానికే ట్వీట్ చేశారు. ప్రధాని మంత్రి చొరవ తీసుకుని స్థానికులను విడిపించాలన్నారు.
Next Story