బ్రేకింగ్: విషాదం: బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు మృతి (వీడియోతో..)
By సుభాష్ Published on 28 May 2020 7:15 AM ISTమెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో సాయివర్ధన్ అనే మూడేళ్ల బాలుడు నిన్న సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన విషయ తెలిసిందే. కానీ చివరికి బాలునికి సరైన ఆక్సిజన్ అందక మృతి
చెందాడు. వ్యవసాయం పొలం వద్ద బాలుని తండ్రి బోరువేయగా, నీళ్లు పడకపోవడంతో బోరు వేయడం నిలిచివేసిన కొద్దిసేపటికే బాలుడు బావిలోపడిపోయాడు. దాదాపు 120 నుంచి 150 అడుగుల లోతు వరకు బావిని తవ్వారు. ఎలాంటి నీళ్లు పడకపోవడంతో అలాగే వదిలేశామని యజమాని తెలిపారు.
బాలుడు పడిన విషయాన్ని అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన రెండు ప్రొక్లెయినర్లతో ఘటన స్థలానికి చేరుకుని బావికి సమాంతరంగా తవ్వడం ప్రారంభించారు. అలాగే రెస్య్కూ టీమ్ ఘటన స్థలానికి చేరుకుకి బాలుడికి ఆక్సిజన్‌ను అందించారు. సుమారు 12 గంటల పాటు సాగిన ఈ రెస్క్యూటీమ్ ఆపరేషన్‌లో చివరికి బాలుడు ఊపిరాడక బావిలోనే కన్నుమూశాడు. అయితే బాలుడు 17 అడుగుల లోతులోనేలో మృతి చెందినట్లు గుర్తించారు.
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్ర్రులు బోరులో నీళ్లు పడకపోవడంతో నిలిచివేయగా, తనతోనే తీసుకెళ్తుండగా, అడుకుకుంటూ తన కళ్ల ముందే పడిపోయి ప్రాణాలు విడవడంపై తల్లి జీర్ణించుకోలేకపోతోంది. కన్నీరు మున్నీరవుతోంది.
తాత భిక్షపతి, తండ్రి గోవర్ధన్, తల్లి కళ్ల ముందే బాలుడు పడిపోయాడు. చిన్నారిని కాపాడే ప్రయత్నాలు ఎన్ని చేసినా చివరికి ఫలించలేదు. ఆయితే బాలుడు పడిన తర్వాత కొంత మట్టికూడా అందులో పడినట్లు తెలుస్తోంది. బోరుబావిని పూడ్చేలోపే ఈ ప్రమాదం జరగడం కుటుంబ సభ్యుల్ని, స్థానికులను కలచివేస్తోంది. బాలుని మృతిదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
[video width="640" height="352" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/WhatsApp-Video-2020-05-28-at-7.00.36-AM.mp4"][/video]
[video width="640" height="352" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/WhatsApp-Video-2020-05-28-at-6.58.55-AM.mp4"][/video]