తెలంగాణ‌లో ల‌క్ష దాటిన క‌రోనా కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Aug 2020 3:49 AM GMT
తెలంగాణ‌లో ల‌క్ష దాటిన క‌రోనా కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,474 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొత్తగా 7గురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,01,865కు చేరగా, మృతుల సంఖ్య 744కి చేరింది.

తాజాగా 1,768 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 78,735కు చేరింది. ఇక ప్రస్తుతం 22,386 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక తాజాగా నమోదైన కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలో 447, మేడ్చల్ 149, కరీంనగర్ 75, వరంగల్‌ అర్బన్ 123, రంగారెడ్డి 201, నల్గొండ 122, నిజామాబాద్ 153‌, సిద్ధిపేటలలో 92 కేసులు నమోదయ్యాయి.Next Story