తెలంగాణలో 229కి చేరిన కరోనా కేసులు

By అంజి  Published on  3 April 2020 2:54 PM GMT
తెలంగాణలో 229కి చేరిన కరోనా కేసులు

తెలంగాణ కరోనా వైరస్‌ కబళిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్క రోజే రాష్ట్రంలో 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 229కి చేరింది. ఇవాళ మరో కరోనా సోకి మరణించారు. మృతుల సంఖ్య 11కి చేరింది.

మృతులు సికింద్రాబాద్‌, షాద్‌నగర్‌కు చెందిన వ్యక్తులు. మరో వైపు కరోనా బారి నుంచి కోలుకున్న వారిలో 15 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 32కి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 186 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ తబ్లీగ్‌ జమాత్‌కు వెళ్లిన వారితో పాటు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల్లోనే ఎక్కువగా కరోనా కేసులు బయటపడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న ఆరు ల్యాబ్‌ల్లో 24 గంటల పాటు మూడు షిప్ట్‌ల్లో యుద్ధప్రాతిపదికన పరీక్షలు నిర్వహిస్తున్నారు.

229 corona positive cases in Telangana

Next Story