భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24గంటల్లో 20,903కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2020 10:50 AM IST
భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24గంటల్లో 20,903కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,903 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఒక్క రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. నిన్న ఒక్క రోజే 379 మంది మృతి చెందారు. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 6,25,544 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 18,213 మంది మరణించారు.

మొత్తం నమోదు అయిన కేసుల్లో 3,79,893 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 2,27,439మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక మహారాష్ట్రలో కరోనా విలయతాండవం ఆడుతోంది. ఇప్పటి వరకు అక్కడ లక్షా86 వేల కేసులు నమోదు కాగా.. 8,178 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 98,392 కేసులు నమోదు కాగా.. 1321 మంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీలో 92,175 కేసులు నమోదు కాగా.. 2864 మంది మరణించారు. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది.

ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అగ్ర రాజ్యం అమెరికాలో నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 54 వేల కొత్త పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు అక్కడ 27లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆతరువాత బ్రెజిల్‌లో 15లక్షల కేసులు నమోదు కాగా.. రష్యాలో 6.6లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

Next Story