తెలంగాణ‌లో కొత్త‌గా 1986 కేసులు.. 14 మ‌ర‌ణాలు

By Medi Samrat  Published on  31 July 2020 4:15 AM GMT
తెలంగాణ‌లో కొత్త‌గా 1986 కేసులు.. 14 మ‌ర‌ణాలు

తెలంగాణలో కరోనా ఉద్దృతి కొనసాగుతోంది. నిన్న(గురువారం 30న) 21,380 శాంపిల్స్‌ను పరీక్షించగా..కొత్తగా మరో 1,986 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 62,703కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 519 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా 816 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 45,388కి చేరింది. 16,796 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..

ఆదిలాబాద్ – 16

భద్రాద్రి కొత్తగూడెం- 29

జీహెచ్‌ఎంసీ -586

జగిత్యాల-7

జనగాం- 21

జయశంకర్‌ భూపాలపల్లి – 4

జోగులాంబ గద్వాల -32

కామారెడ్డి -46

కరీంనగర్ -116

ఖమ్మం -41

ఆసిఫాబాద్ -2

మహబూబ్‌ నగర్ -61

మహబూబాబాద్ -37

మంచిర్యాల- 35

మెదక్ – 45

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 207

ములుగు –27

నాగర్‌కర్నూల్ – 30

నల్లగొండ – 36

నారాయణపేట -4

నిర్మల్ -9

నిజామాబాద్ –19

పెద్దపల్లి -26

రాజన్న సిరిసిల్ల -23

రంగారెడ్డి -205

సంగారెడ్డి -108

సిద్దిపేట – 20

సూర్యాపేట-06

వికారాబాద్‌-05

వనపర్తి – 18

వరంగల్‌ రూరల్ -30

వరంగల్‌ అర్భన్ -123

యాదాద్రి భువనగిరి -12

Next Story
Share it