తెలంగాణలో కరోనా విశ్వరూపం.. ఒక్కరోజే 169 కేసులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 May 2020 4:53 PM GMTతెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. తాజాగా గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదుయ్యాయి.
అందులో తెలంగాణకు సంబంధించినవి 100 కాగా.. మిగిలనవి 69 ఉన్నాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 82 కేసులు వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్ 2, సంగారెడ్డి జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. వలస కూలీల్లో ఐదుగురికి, విదేశాల నుంచి వచ్చిన మరో 64 మందిలో కరోనా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు 71 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు.
ఇదిలావుంటే తెలంగాణలో మొదట్లో కేసుల సంఖ్య తగ్గుముఖం ఉన్నా.. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఘటన తర్వాత దేశంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో దేశంలో లాక్‌డౌన్ కఠినంగా అమలువుతుంది. అయినా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. . కరోనా కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఫలితం లేకుండా పోతోంది.