కరోనాతో 14 నెలల బాలుడు మృతి

By రాణి  Published on  8 April 2020 11:31 AM GMT
కరోనాతో 14 నెలల బాలుడు మృతి

కరోనా సోకి గుజరాత్ లోని జామ్ నగర్ జిల్లాలో 14 నెలల వయసు బాలుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆ జిల్లా అధికార యంత్రాంగం వెల్లడించింది. ఏప్రిల్ 5వ తేదీన శిశువుకి కరోనా పాజిటివ్ రాగా..రెండ్రోలుగా వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. వైరస్ కారణంగా శిశువు శరీరంలో అవయావలన్నీ ఫెయిల్ అవ్వడంతో బుధవారం చనిపోయినట్లు పీటీఐ (ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా) వెల్లడించింది.

శిశువుకి వైరస్ ఎలా సోకిందన్న విషయం ఇంతవరకూ తెలియలేదు. బాలుడి తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని అజాంగడ్ లో వలస కార్మికులే అయినా లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి వారు ఏ ప్రాంతానికి ప్రయాణించలేదని చెప్తున్నారు. ప్రస్తుతం శిశువు తల్లిదండ్రులు కూడా క్వారంటైన్ లో ఉన్నారు.

జామ్ నగర్ జిల్లాలో నమోదైన మొదటి కరోనా కేసు..మొదటి కరోనా మరణం ఈ శిశువే. గుజరాత్ లో మొత్తం 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బహుశా దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా మరణాల్లో అతి పిన్నవయసులో మృతి చెందింది ఈ బాలుడే కావచ్చు. శిశువు మృతితో జామ్ నగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వీరి కుటుంబం నివాసమున్న ప్రాంతంలో గల ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Also Read : ఎంతమంది ఉన్నా ఆఖరికి ఆ నలుగురే దిక్కు..

Next Story