ఏడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన 10వ తరగతి విద్యార్థి.. ఎంత డిమాండ్ చేశాడంటే..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Nov 2019 6:31 PM IST
హైదరాబాద్: మీర్ పేట్ పీఎస్ పరిధిలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఏడేళ్ళ బాలుడిని పదో తరగతి విద్యార్ది కిడ్నాప్ చేశాడు. అంతటితో ఆగక బాలుడి తండ్రిని మూడు లక్షల డిమాండ్ చేశాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కు పాల్పడ్డ పదోతరగతి విధ్యార్ధిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్‌ఆర్ స్విమ్మింగ్ ఫుల్ దగ్గర ఆడుకుంటున్న అర్జునును శివచరణ్ కిడ్నాప్ చేశాడని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. గతంలో కూడా శివ చరణ్ లక్ష రూపాయలు దొంగతనం చేశాడు. శివ చరణ్‌ను కేర్ అండ్ ప్రోటాక్షన్ యాక్ట్ ప్రకారం, ఆఫన్డర్‌గా నిర్దారించి కోర్టులో ప్రవేశపెడతామని సీపీ పేర్కొన్నారు. కిడ్నాప్‌కు గురైన బాలుడు అర్జున్ తండ్రి రాజు సాప్ట్‌వేర్ ఉద్యోగి. రూ.25 వేల నగదు, రూ.2 లక్షల 75 వేల చెక్ ఇస్తే వదిలిపెడతానని అర్జున్ తండ్రికి ఫోన్ చేసి బెదిరించాడని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మీర్ పేట పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి కిడ్నాపర్‌ను పట్టుకున్నారు. కిడ్నాపర్ బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కి తరలించామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.