మోదీ పాలకు ఏడాది పూర్తి..భారతావనిపై మోదీ చెరగని ముద్ర
By సుభాష్ Published on 30 May 2020 4:06 AM GMTదేశ ప్రధాని నరేంద్రమోదీ రెండో సారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. శనివారం నాటితో ఎన్డీయే ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గత ఐదేళ్ల పాలన కంటే భిన్నంగా ఉందని, కొన్ని సాహసోపేత నిర్ణయాలు మోదీ తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రెండోసారి గద్దెనెక్కిన మోదీ.. భారతావనిపై తనదైన చెరగని ముద్ర వేసుకున్నారు. తన పాలనలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పగ్గాలు చేతికిందిన మొదటి వందరోజుల్లోనే ఎన్నో సాహసోపేత చర్యలకు శ్రీకారం చుట్టింది మోదీ ప్రభుత్వం. చివరి నె లల్లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తుండటంతో మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టేందుకు చర్యలు చేపట్టింది.
అవినీతికి అవకాశం లేకుండా..
మొదటి ఐదేళ్లలో అవినీతికి అవకాశం లేకుండా పాలన సాగించిన మోదీ.. ప్రజల మెప్పు పొందారు. మొదటి సారి వచ్చిన మెజార్టీ కంటే రెండోరి భారీ మెజార్టీతో అధికారంలోఓకి వచ్చారు. దీంతో మోదీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రిపుల్ తలాక్, పౌరసత్వ చట్టంలో సవరణలు, కశ్మీర్ విభజన, కశ్మీర్‌కి ప్రత్యేక హోదా తొలగింగించి ఔరా అనుపించుకున్నారు. దీనిపై పెద్ద చర్చే కొనసాగింది.
అలాగే ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య కేసు విషయంలో అయోధ్యలోనే రామ మందిరాన్ని నిర్మించాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో బీజేపీ కలిసొచ్చింది. మోదీ రెండో దశ పాలనలోని తొలి ఏడాదిలోనే అయోధ్యకు పరిష్కారం లభించింది. ఈ కేసులో వివాదస్పద స్థలం 2.77 ఎకరాలను రామ జన్మభూమి ట్రస్ట్‌కు ఇవ్వాలని సుప్రీం కోర్టు 2019 నవంబర్ 9వ తేదీన సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో యావత్ భారత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. మూడు నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి ఆలయ నిర్మాణానికి సంబంధించిన మొత్తం స్థలాన్ని స్వాధీనం చేయాలని సుప్రీం కోర్టు చెప్పినే నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన లోక్‌సభ వేదికగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ను ప్రకటించారు. ఆలయ నిర్మాణానికి సేకరించిన 62.23 ఎకరాల భూమిని దానికి స్వాధీనం చేశారు.
అలాగే చరిత్రలో నిలిపోయిన తేదీలను పరిశీలిస్తే అందులో 2019 ఆగస్టు 5వ తేదీ. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించినట్లయింది. మోదీ పాలనలో ఈ సాహసోపేత నిర్ణయమే జమ్మూకశ్మీర్ విభజన. ఆ రాష్ట్రాన్ని, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిన ప్ఆరంతాలుగా విభజించింది. ఈ బిల్లును ఎవరికి తెలియకుండానే హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగస్టు 5న రాజ్యాసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా వ్యూహాలు రచించారు.
ఉగ్రవాద కార్యకాలాపాలకు పాల్పడే వ్యక్తులను ఉగ్రవాదులుగా ముద్రవేసేందుకు వీలుగా తీసుకొచ్చిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల సవరణ బిల్లుకు 2019 ఆగస్టు 2న పార్లమెంట్‌లో ఆమోదముద్ర వేసింది. అప్పటి వరకూ కేవలం సంస్థలపైనే ఉగ్రవాద ముద్ర వేసేందుకు వీలుండేది. ఈ సవరణతో వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా గుర్తించి అలంఆటి వారిని విదేశాల నుంచి తరప్పించే అధికారలను భారతీయ వ్యవస్థకు అప్పగించింది.
ఇక దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న తరుణంలో కరోనాను తరిమికొట్టేందుకు కేంద్రం ఎంతగానో శ్రమిస్తోంది. ఆర్థిక వ్యవస్థా తీవ్ర స్థాయిలో పడిపోవడంతో భారీ ప్యాకేజీని ప్రకటించారు మోదీ. కరోనా వల్ల ప్రజంతా మిగతా విషయాలో పక్కనపెట్టేసి కరోనాను ఎలా ఎదుర్కొందామనే పరిస్థితి వచ్చింది. ఇలా మోదీ ఏడాది పాలనలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకోవడంపై ప్రజలు మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.