అక్రమ వసూళ్లకు పాలడుతున్న ముఠాపై ఏసీబీ దృష్టి-ACB's over illegal Construction
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Nov 2019 11:48 AM ISTహైదరాబాద్: నగరంలో మీడియా పేరు చెప్పి నూతన భవన నిర్మాణాల వద్ద అక్రమ వసూళ్లకు పాలడుతున్న ముఠా పై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. ఏకంగా ఒక టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ తో కలిసి రూ.2 లక్షలు డిమాండ్ చేసిన ఒక ఇద్దరు రిపోర్టర్లను, సెక్షన్ ఆఫీసర్ ని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే గత రెండేళ్లుగా ముగ్గురు రిపోర్టర్లు ఒక ముఠా గా ఏర్పడి పశ్చిమ మండలం పరిధి లో పలు ప్రాంతాలలో జరిగే భవన నిర్మాణాల వద్దకి వెళ్లి మీకు అనుమతలు లేవు అంటూ... అవినీతి టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి లక్షలాది రూపాయలు వసూలు ఏసీబీ గుర్తించింది. ఈ ముఠా బారిన పడ్డ వారు సంఖ్య వందల్లో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారితో పాటు రిపోర్టర్ సోపాల శ్రీనివాస్, రిపోర్టర్ ఆకుల కిరణ్ లను అరెస్ట్ చేశారు.
ఈ కేసు లో కీలక పాత్ర ఫోన్ ద్వారా బేరసారాలు చేసిన రిపోర్టర్ తడక విజయ్ కుమార్ పరారీలో ఉన్నట్లు సమాచారం. తడక విజయ్ పై గతంలో ఎన్నో ఆరోపణలు, పత్రికల్లో కథనాలు వచ్చిన విషయం విధితమే, మొత్తానికి ఈ ముఠాని పట్టుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముఠా గతంలో చేసిన వసూళ్లు వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నట్టు సమాచారం.