ఆతిథ్యం + పారిశుధ్యం = అహో హైదరాబాద్!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Nov 2019 6:30 AM GMT
ఆతిథ్యం + పారిశుధ్యం = అహో హైదరాబాద్!!

మన హైదరాబాదీయులు ఆతిథ్యానికి పెట్టింది పేరు. అతిథులను ముగ్ధులు చేసేంత గొప్పగా ఉంటుంది మన ఆతిథ్యం. దీన్ని మెహమాన్ నవాజీ అంటారు. అందుకే జీ హెచ్ ఎంసీ మన ఆతిథ్యానికి మరిన్ని మెరుగులు దిద్దుతూ నగరంలోకి పర్యాటకులు ఎక్కువగా వచ్చే పన్నెండు స్థానాల్లో పారిశుధ్యం పెంచాలని నిర్ణయించింది. ఈ పన్నెండు చోట్ల ఇరవై నాలుగు గంటలు పారిశుధ్యం ఉండేలా చూడాలని నిర్ణయించింది. ఈ బాధ్యత కాంట్రాక్టర్లకు కట్టబెట్టి వారు తగిన సంఖ్యలో పారిశుధ్య కార్మికులను నియమించేలా చూడాలని తీర్మానించింది. పొరబాట్లు జరిగినా, పని సరిగ్గా చేయకపోయినా పనిష్మెంట్లు కూడా ఉంటాయి. ఇలా స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్ పరిధిలో ఉన్న నగరాలన్నిటిలోనూ జరుగుతుంది. దీనిని ఒక పైలట్ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నారు.

ఈ పన్నెండు ప్రదేశాల్లో చార్మినార్, మక్కా మసీదు, చౌమహల్లా ప్యాలెస్, నెక్ లేస్ రోడ్, సాలార్ జంగ్ మ్యూజియం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బిర్లా మందిర్, కుతుబ్ షాహీ సమాధులు, టాంక్ బండ్, నెహ్రూ జువాలజికల్ పార్క్, పబ్లిక్ గార్డెన్స్, గోల్కొండలు ఉన్నాయని జీ హెచ్ ఎంసీ పారిశుధ్య స్పెషల్ కమిషనర్ సుజాతా గుప్త చెబుతున్నారు.

Next Story