నిన్నటి వరకూ మృత్యుఘోషలో ఉన్న ఇటలీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందా అంటే..గురువారం వచ్చిన కరోనా రిపోర్ట్ ని బట్టి అర్థమవుతోంది. బుధవారం వరకూ 1,10,574 కరోనా కేసులు నమోదవ్వగా..13,155 మంది మృతి చెందారు. గురువారం ఒక్క కరోనా కేసు గానీ, కరోనా మరణం కూడా నమోదవ్వలేదు. దీనిని బట్టి చూస్తే ఆ దేశంలో కరోనా ప్రభావం తగ్గినట్లే అనిపిస్తుంది. నిన్నటి వరకూ వేల కేసులు, వందల మరణాలు సంభవించిన ఇటలీలో ఒక్కరోజులోనే 0 కేసులున్నాయంటే నమ్మశక్యం కాని విషయమే. ఇప్పుడు ఇటలీపై చైనా మీద వచ్చిన అనుమానాలే వస్తున్నాయి.

Also Read : ప్రపంచానికి ఆదర్శంగా క్యూబా..శత్రు దేశానికి డాక్టర్ల సరఫరా

చైనా కూడా నమోదైన కేసులు, మరణాల సంఖ్యలను తక్కువ చూపిస్తోందని అక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు. 42000 మరణాలు నమోదైతే.. కేవలం 3 వేలకు పైగా మరణాలే నమోదయ్యాయని చెప్తున్న లెక్కలు అబద్ధమని చెప్తున్నారు. స్థానికుల ఆరోపణలకు అక్కడి స్మశాన వాటికల్లో మృతుల కుటుంబాలకు అందజేసిన కుండలు అద్దం పడుతున్నాయి. 12 రోజుల్లో రోజుకు 3500 చితా భస్మం కుండలు అందజేసినట్లు చైనాలోని 9 స్మశాన వాటికలు చెప్తున్నాయి. ఇప్పుడు ఇటలీ కూడా తమ దేశంలో కరోనా కేసులు ఎక్కువున్నాయని చెప్పకుండా ఉండేందుకు చైనా లాగే వ్యవహరిస్తోందా అన్న అనుమానం కూడా తలెత్తుతోంది.

Also Read : ఏపీలో 143కి చేరిన కరోనా కేసులు

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.