చేప మృతికి సంతాపం తెలియజేసిన దేశాధ్యక్షుడు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Sep 2020 11:24 AM GMTఎవరైనా ప్రముఖులు మరణించినప్పుడో.. లేదంటే.. ఏదైనా ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడో దేశాధ్యక్షులు సంతాపం తెలియజేస్తారు. అయితే.. జాంబియా అధ్యక్షుడు ఎడ్గార్ లుంగూ ఓ చేప మరణిస్తే సంతాపం తెలియజేశారు. చేప చనిపోతే దేశాధ్యక్షుడు సంతాపం తెలపడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా ? అవును నిజం తెలుసుకోవాలంటే వివరాళ్లోకెళ్లాల్సిందే..
జాంబియాలోని కాపర్‌బెల్ట్ యూనివర్సిటీలోని చెరువులో గత 20 ఏళ్లుగా మాఫిషి అనే చేప ఉండేది. ఆ చేప ఒక సెంటిమెంటల్ చేప. అయితే.. విద్యార్థులు పరీక్షలకు హజరయ్యే ముందు ఆ చేపను చూసి వెళ్లేవారు. దాని వల్ల వారికి మంచి జరుగుతుందనే నమ్మకం. మరికొంతమంది ఆ చేపను చూడటం ద్వారా తమ మానసిక ఒత్తిడి తగ్గుతుందని భావించేవారట. అందుకే ఆ చేపను గుడ్‌లక్ ఫిష్ అని అందరూ భావించేవారు.
అయితే.. ఇప్పుడు ఆ చేప చనిపోవడంతో విద్యార్థులు సంతాపంగా క్యాంపస్ చుట్టూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. విషయం తెలుసుకున్న జాంబియా అధ్యక్షుడు ఎడ్గార్ లుంగూ కూడా చేప మృతికి సంతాపం తెలిపారు. ఇదిలావుంటే.. యూనివర్సిటీ అధికారులు చనిపోయిన చేపను ఖననం చేయకుండా.. కెమికల్స్ సాయంతో ల్యాబ్‌లో భద్రపర్చాలని ప్లాన్ చేస్తున్నారు.