ఇంటివాడు కాబోతున్న చాహల్.. అమ్మాయి మాత్రం మ‌ల్టీ టాలెంటెడ్‌.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Aug 2020 6:19 PM IST
ఇంటివాడు కాబోతున్న చాహల్.. అమ్మాయి మాత్రం మ‌ల్టీ టాలెంటెడ్‌.!

టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ ధనశ్రీ వర్మతో నిశ్చితార్థం జరిగింది. ఈ మేర‌కు నిశ్చితార్థం ఫొటోను సోషల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నాడు. ఫోటోతో పాటు ‘వుయ్ సెడ్ ఎస్’ అని ట్యాగ్‌ను రాసి పోస్టు చేశాడు. కాగా.. చాహల్ కాబోయే భార్య మ‌ల్టీటాలెంటెడ్‌ అని తెలుస్తోంది. ఆమె డాక్ట‌ర్‌, కొరియోగ్రాఫర్, యూట్యూబ‌ర్‌.

ఇదిలావుంటే.. గత కొన్ని రోజులుగా ధనుశ్రీతో ప్రేమలో ఉన్న చాహల్‌.. గతంలో ఆమె వీడియోలను‌ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన చాహల్‌.. త్వరలో గ్రౌండ్‌లోకి దిగ‌నున్నాడు. యూఏఈలో జరగబోతున్న ఐపీఎల్‌-2020 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్టు తరపున చాహల్ ఆడ‌నున్నాడు.

జూలై 23, 1990వ సంవ‌త్స‌రంలో జన్మించిన చాహ‌ల్.. జూన్ 11, 2016 జింబాబ్వేతో జ‌రిగిన వ‌న్డే ద్వారా భార‌త జ‌ట్టులోకి ఆరంగ్రేటం చేశారు. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్న‌ర్ అయిన చాహ‌ల్ 52 వ‌న్డేల్లో 91 వికెట్లు.. 42 టీ20 మ్యాచుల్లో 55 వికెట్లు సాధించాడు.

View this post on Instagram

We said “Yes” along with our families❤️ #rokaceremony

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on

Next Story