క్షమాపణ చెప్పి సభలో అడుగు పెట్టండి..!

By అంజి  Published on  15 Dec 2019 10:52 AM GMT
క్షమాపణ చెప్పి సభలో అడుగు పెట్టండి..!

అమరావతి: ప్రజా సమస్యలపై చర్చించడానికి టీడీపీకి ధైర్యం లేదని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. సభను తప్పుదోవ పట్టించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని శ్రీకాంత్‌ రెడ్డి ఆరోపించారు. శాసన సభలో గందరగోళనం సృష్టించేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు దారుణమని, సభలో కావాలనే గొడవలు సృష్టించారన్నారు. దిశ చట్టంపై చర్చ జరుగుతున్నప్పుడు కావాలనే రచ్చ చేశారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టను దెబ్బతీసేలా టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ పరిపాలనను చూసి.. తమకు ఇక మనుగడ ఉండదనుకున్న టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని పేర్కొన్నారు.

ఏ అంశంపైనా కూడా చర్చించేందుకు టీడీపీ సిద్ధంగా లేదన్నారు. మార్షల్స్‌తో బాబు ప్రవర్తించిన తీరు వీడియోలో సృష్టంగా ఉందని తెలిపారు. మార్షల్స్‌పై దురుసుగా ప్రవర్తించడమే కాక ఎదురుదాడి చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ఉల్లి ధరలపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదన్నారు. నీటి ప్రాజెక్టులపై మాట్లాడుదామంటే చంద్రబాబు చేతులెత్తేశారన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. వచ్చే రెండు రోజులైనా సభ సజావుగా జరిగేందుకు టీడీపీ సభ్యులు సహకరించాలన్నారు. చేసిన తప్పులపై క్షమాపణ చెప్పి టీడీపీ సభ్యులు సభకు రావాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే నిందితులు ఎంతటివారైనా వదిలి పెట్టేది లేదన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ తెచ్చిన దిశ చట్టంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు. ప్రతి పనిని ప్రభుత్వం పారదర్శకంగా చేస్తోందని తెలిపారు. దిశ బిల్లు చర్చలోకి రాకుండా ఎల్లోమీడియా తప్పుడు రాతలు రాయిస్తోందన్నారు. గుంటూరు జిల్లాలో హత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై దిశ యాక్ట్‌ ద్వారా విచారణ జరుగుతోందని..తప్పు చేసినట్లు తేలితే ఉరి శిక్ష పడుతుంద వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

Next Story