నేతలకు 'భద్రత' తొలగింపు.. వైసీపీ సర్కార్‌ వ్యూహామేంటీ.!

By అంజి  Published on  11 Feb 2020 7:09 AM GMT
నేతలకు భద్రత తొలగింపు.. వైసీపీ సర్కార్‌ వ్యూహామేంటీ.!

అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ నేతలకు భద్రత తొలగించింది. మాజీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు పూర్తిగా భద్రత తొలిగింపు చేశారు. మరి కొందరు సీనియర్‌ నేతలు భద్రత కల్పించాలని పెట్టుకున్న అప్లికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. సోమవారం నుంచి జరుగుతున్న భద్రత తొలగింపు ప్రచారం చివరకు నిజమైంది.

మాజీ మంత్రులు నారా లోకేష్‌, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లరావు, జేసీ దివాకర్‌, పల్లె రఘునాథరెడ్డి, నక్క ఆనంద బాబు, కాల్వ శ్రీనివాసులకు వైసీపీ ప్రభుత్వం భద్రత తొలగించింది. అయితే ఇలా భద్రత తొలగించడంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలా వ్యహరించడాన్ని చూస్తుంటే ఖచ్చితంగా క్షక్ష సాధింపు చర్యలాగే ఉందని అంటున్నారు. భద్రత తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నిర్ణయం సరైనది కాదని, గత ప్రభుత్వం కూడా ఇదే విధంగా వ్యహరిస్తే పరిస్థితి ఏమై ఉండేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

స్టేట్‌ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఆదేశాల మేరకే భద్రతను తొలగించామని పోలీసులు అంటున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని నేతలు అంటున్నారు. రాష్ట్రంలో కొంత మంది ప్రముఖులకు ప్రానహాణి ఉందని, భద్రత కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో ప్రధాన ప్రతిపక్ష నేతలకు భద్రత కొనసాగించామని, ఇప్పడు వైసీపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని ప్రతిపాటి అన్నారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా భద్రత తొలగించడంపై నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాజీ సీఎం చంద్రబాబుకు కూడా ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భద్రత తొలగించింది.

Next Story