మధ్యలో సీట్స్ ఖాళీగా ఉంచండి.. పూర్తిగా కప్పి ఉంచే గౌన్ ను అయినా ఇవ్వండి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Jun 2020 4:50 PM IST
మధ్యలో సీట్స్ ఖాళీగా ఉంచండి.. పూర్తిగా కప్పి ఉంచే గౌన్ ను అయినా ఇవ్వండి..!

దేశీయ ఎయిర్ లైన్స్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. రెండు నెలల తర్వాత మే 25న విమాన ప్రయాణాలు మొద‌ల‌య్యాయి. కరోనా భయంతో అందరూ ఫేస్ షీల్డ్ లు ధరించి విమాన ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. తాజాగా ఎయిర్ లైన్స్ విమాన ప్రయాణీకుల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. విమానాల్లో రెండు సీట్ల మధ్య ఖచ్చితంగా గ్యాప్ ఉండాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఏ) ఎయిర్ లైన్స్ కు స్పష్టం చేసింది.

సీట్ల మధ్య గ్యాప్ ఉంచలేని పక్షంలో మధ్య సీట్ లో కూర్చునే వ్యక్తికి పూర్తిగా కప్పి ఉంచే గౌన్ ను ఇవ్వాలని సూచించింది. అది కూడా టెక్స్టైల్ మినిస్ట్రీ అప్రూవ్ చేసిన ప్రమాణాలు ఉన్నవే ఇవ్వాలని తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన వారు మాత్రమే పక్క పక్కన కూర్చోడానికి అర్హులు అని తెలిపారు. అలాగని టికెట్స్ రేట్స్ పెంచుతామంటే మాత్రం ఊరుకోమని డిజిసిఏ తెలిపింది. తరచుగా శానిటైజేషన్ ను పూర్తీ చేస్తుండాలని.. క్యాబిన్ ఎయిర్ ను మారుస్తూ ఉండాలని.. విమానంలో మీల్స్, వాటర్ ఇవ్వకూడదని తెలిపారు.

డొమెస్టిక్ ప్యాసెంజర్ విమానాల సర్వీసులు.. లాక్ డౌన్ కారణంగా రెండు నెలల పాటూ నిలిపివేశారు. ఇంకా ఇంటర్నేషనల్ విమానాల సర్వీసులు భారత్ లో మొదలుపెట్టలేదు. సుప్రీంకోర్టు కూడా మధ్యలో సీట్లను ఖాళీగా ఉంచాలని సూచించింది. అలా చేస్తే సామాజిక దూరాన్ని పాటించే అవకాశం ఉంటుందని.. కరోనా వైరస్ వ్యాప్తిని ఆపవచ్చని తెలిపారు. కమర్షియల్ ఎయిర్ లైన్స్ గురించి ఆలోచించడం కంటే.. ప్రయాణీకుల ఆరోగ్యం మీదనే ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించింది. సామాజిక దూరం పాటించడం అన్నది కామన్ సెన్స్ తో కూడుకున్నదని.. కనీసం ఆరు అడుగుల సామాజిక దూరాన్ని పాటించాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది.

Next Story