ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణ మృదంగం
By అంజి Published on 28 March 2020 11:41 PM GMTహైదరాబాద్: ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ తదితర దేశాల్లో కరోనా మరణ మృదంగం మోగుతోంది. వైరస్ బాధితులు అంతకంతకూ పెరుగుతుండటం దానికి తోడుగా మృతుల సంఖ్య పెరగడం ప్రపంచ దేశాలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. చాలా దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతుండడం వల్ల.. ఆయా దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు లక్షలు దాటింది. ఒక్క యూరప్‌లోనే కరోనాతో మరణించిన వారి సంఖ్య 20 వేలు దాటింది. కరోనా వైరస్‌కు సంబంధించిన వివరాలను జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెబ్ పోర్టల్‌లో నమోదు చేస్తోంది. ఆ పోర్టల్ సమాచారం ప్రకారం.. ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి రెండు రోజుల సమయమే పట్టింది.
Also Read: ఏపీలో 19, తెలంగాణలో 67 కరోనా కేసులు..
అమెరికాలో 1,13,677 , ఇటలీలో 92,472 , చైనాలో 81,394, స్పెయిన్‌లో 72,248 , జర్మనీలో 53,340 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 28 వేలు దాటిందని తెలిసింది. బ్రిటన్‌లో మృతుల సంఖ్య 1000 దాటింది.
భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 933 కు చేరింది.
Also Read: కరోనా పై సమరం : టాటా గ్రూప్ రూ.1500 కోట్ల విరాళం
కరోనా వైరస్ ప్రభావంతో ఇటలీ దేశం అల్లాడుతోంది. మృతుల సంఖ్య విపరీతంగా పెరగడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికే ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 10 వేలు దాటిందని ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
దేశం | మొత్తం కేసులు | మరణాలు |
అమెరికా | 1,13,677 | 1,903 |
ఇటలీ | 92,472 | 10,023 |
చైనా | 81,394 | 3,925 |
స్పెయిన్ | 72,248 | 5,812 |
జర్మనీ | 53,340 | 399 |
ఇరాన్ | 35,408 | 2,517 |
ఫ్రాన్స్ | 32,964 | 1,995 |
యూకే | 17,089 | 1,019 |
స్విట్జర్లాండ్ | 13,377 | 242 |