సంతోషకరమైన దేశం ఇదే.. యూఎన్‌ఓ వెల్లడి
By అంజి
హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత సంతోషరమైన దేశంగా ఫిన్‌లాండ్ మరోసారి నిలిచింది. ఇప్పటికే రెండు సార్లు సంతోషకర దేశంగా ఫిన్ లాండ్ నిలిచిన విషయం తెలిసింది. తాజాగా యూఎన్‌ఓ నివేదికలో మరో స్థానాన్ని చేజార్చకుండా ఫిన్ లాండ్ కాపాడుకుంది. మార్చి 20న వరల్డ్ హ్యాపినెస్ డే.. ఈ సందర్భంగా యూఎన్‌ఓ ప్రపంచ దేశాల హ్యాపినెస్ ర్యాంక్‌లను విడుదల చేసింది. ఫిన్‌లాండ్ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్, న్యూజిలాండ్, ఆస్ట్రియా దేశాలు నిలిచాయి.
Also Read: కరోనా ఎఫెక్ట్: జగన్ వార్నింగ్.. నిర్మానుషంగా మారిన రోడ్లు
ఇక భారత్‌దేశం మాత్రం సంతోషకర సూచీ నివేదికలో చాలా వెనకలా ఉంది. హ్యాపినెస్ దేశాల జాబితాలో భారత్ 144వ ర్యాంక్ వద్ద నిలిచింది. శుత్రదేశం పాకిస్తాన్ 29, పొరుగు దేశాలు నేపాల్ 15, బంగ్లాదేశ్ 107, శ్రీలంక 130 స్థానాల్లో నిలిచాయి. లక్సెంబర్గ్ తొలిసారి 10వ స్థానం దక్కించుకుంద. 153 దేశాల్లో యూఎన్‌ఓ హ్యాపీయెస్ట్ కంట్రీ సర్వే నిర్వహించింది. అయితే ఈ సమాచారం గత రెండు సంవత్సరాల్లో సేకరించింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అయితే కరోనా ఆందోళన ప్రభావం ఈ నివేదికపై లేదని యూఎన్‌ఓ చెప్పింది. ఆయా దేశాల ప్రజల జీవన స్థితిగతులు, ప్రజల జీవనశైలిని పరిశీలించిన యూఎన్‌ఓ ప్రతినిధులు ఈ జాబితాను రూపొందించారు. ఇక అతి తక్కువగా సంతోషకరంగా ఉన్న దేశాల్లో అప్ఘానిస్తాన్ ఫస్ట్ స్థానంలో నిలిచింది. భారత్ కూడా 10 స్థానంలో ఉంది.