నీటి వాడకంలో అగ్రస్థానం.. భారత్‌లో నీటి కష్టాలు..
By అంజి
మార్చి 22 ప్రపంచ జలదినోత్సం.. మానవాళి మనుగడకు నీరు అత్యంత అవసరం.
నీరు లేని భూమిని ఊహించుకుంటే అది వర్ణనాతీతగంగా ఉంటుంది. సముద్రాలు, పారే నదులు, కాలువలు, బావులు, చెరువులు ఏమీ ఉండవు. ఇవీలేక పోతే భూమి ఒక మట్టి గడ్డలాగా ఉంటుంది. అందుకే నీరు కాపాడుకునేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వర్షం ద్వారా ఒడిసిపట్టి నీటి గుంతల ద్వారా భూమిలోకి వెళ్లేలా చేస్తున్నారు. నదుల ద్వారా ఎంతో నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లకుండా అనేక ప్రాజెక్టులు నిర్మించారు.. నిర్మిస్తున్నారూ కూడా.
అయితే భూమి పుట్టినప్పుడు ఎంత నీరు ఉందో.. ఇప్పుడు కూడా అంతే నీరు భూమిలో ఉంది. అయితే దాన్ని వాడుకునే జనాభా పెరిగింది. దీంతో తీవ్ర నీటి సమస్యలు ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ బాధ్యత చేపట్టాలి. మనం ప్రతి రోజు అనేక సందర్భాల్లో నీటిని వినియోగిస్తుంటాం. అదే సమయంలో నీటిని వృధా చేయకుండా కృషి చేయాలి. నీరు అనేది ప్రకృతి వనరు.. దానిని మనం సృష్టించలేం. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టుకోవాలి.. అప్పుడే మన భవిష్యత్తుకు కష్టాలు తప్పుతాయి. నీటిని పొదుపుగా వాడుకోవాలి.
ప్రపంచ జల దినోత్సవాన్ని యూఎన్‌ఓ జనరల్ అసెంబ్లీ మార్చి 22 గా ప్రకటించింది. 1993 నుండి ప్రతి సంవత్సరం మార్చి 22 న వాటర్ డే జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవం మొదట లాంఛనప్రాయంగా రియో డి జనీరో, బ్రెజిల్ లో పర్యావరణం, అభివృద్ధి పై 1992 ఐక్యరాజ్య సమితి సమావేశం (UNCED) యొక్క ఎజెండా 21 లో ప్రతిపాదించబడింది. 1993 లో ప్రారంభమైన ఈ పాటింపు అప్పటి నుండి గణనీయంగా అభివృద్ధి చెందింది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణంకాలు
ప్రపంచ వ్యాప్తంగా 78.5 కోట్ల మందికి తాగునీరు అందుబాటులో లేదు. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణంకాలు చెబుతున్నాయి. అయితే వీరిలో ఎక్కువ భారతీయులే ఉండటం బాధకర విషయం. దేశంలో దాదాపు 16.30 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందడం లేదు. దాదాపు 100కుపైగా దేశాల్లో నీటి సమస్యలు ఉన్నాయని తెలిసింది. నీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. 1951లో ప్రతి భారతీయుడికి సగటున 5,200 ఘన మీటర్ల నీరు అందుబాటులో ఉండేది. అది 2011 నాటికి 1,545 ఘన మీటర్లకు పడిపోయింది.
వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం.. ప్రతి సంవత్సరం 230 క్యూబిక్ కిలోమీటర్ల మేర భూగర్భ నీటిని భారత్ వాడుకుంటోంది. ఇది ప్రపంచ మొత్తం నీటి వాడకంలోనే నాల్గోవ వంతు కంటే ఎక్కువ కావడం గమనార్హం. మన దేశంలో వ్యవసాయం కోసం బోర్ల ద్వారా భూగర్భ జలాలాను వీపరితంగా తోడేస్తున్నారు.
ప్రపంచంలో నీటి వాడకంలో భారత్‌దే మొదటి స్థానం.
నీరు ఉంటేనే ఏదైనా జీవనం.. నీరు లేకపోతే సమస్తం నీర్జీవం.. కావున ప్రతి ఒక్కరూ నీటి పొదుపుకు పాటుపడాలి. నీటిని వృధా చేయకుండా వాడుకోవాలి. నీటిని కాపాడుకోని.. మన భవిష్యత్తును ముందుకు సాగిద్దాం. ఇవాళ ప్రపంచ జల దినోత్సం.. ప్రతి ఒక్కరూ మొక్కుబడి కార్యక్రమాలు కాకుండా జలసంరక్షణను ఒక బాధ్యతగా స్వీకరించి కృషి చేయాలి.
ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు తాగునీరు లేక అల్లాడుతున్నారు. మనకు అందుబాటులో ఉన్న నీటిని వృధా చేస్తున్నారు. నీటిని వ్యర్థాలతో కలుషితం చేస్తున్నాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తును ఊహించుకోవడం కష్టమే. 2050 నాటికి భూమి మీద ప్రజలకు కావాల్సినంత నీరు ఉండదని జల నిపుణులు చెబుతున్నారు. ప్రజలు స్నానానికి నీటికి బదులు కెమికల్స్ పూసుకుంటారట, ఇక నీటి వనరుల చుట్టూ సిబ్బంది కాపాల కాస్తుంటారట,
నీరు లేక భవిష్యత్తులో స్త్రీ, పురుషులందరూ రోజు తల షేవ్ చేసుకునే పరిస్థితి వస్తుందని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నారు. అంటే భవిష్యత్తు కోసం నీటిని సంరక్షించేందుకు ఎంతో పోరాటం చేయాలి.