ఏపీ లోని 13 నగరాల్లో వరల్డ్ కప్ స్పెషల్ స్క్రీనింగ్
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను బిగ్ స్క్రీన్లపై ప్రదర్శించేందుకు ఆంధ్రా క్రికెట్ సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
By Medi Samrat Published on 18 Nov 2023 8:17 PM ISTవరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను బిగ్ స్క్రీన్లపై ప్రదర్శించేందుకు ఆంధ్రా క్రికెట్ సంఘం ఏర్పాట్లు చేస్తోంది.భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ ను ఏసీఏ విజయవాడ, కడప, వైజాగ్ లో ఇలాగే బిగ్ స్క్రీన్లపై ప్రదర్శించింది. ఫైనల్ మ్యాచ్ ను ఏకంగా 13 నగరాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా ప్రదర్శించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలను ఇందుకోసం ఎంపిక చేశారు. ఆదివారం జరిగే భారత్, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ ను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు,విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతిలో ఏసీఏ బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రదర్శించనున్నారు.
ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ఏపీలో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల వివరాలివే
1.శ్రీకాకుళం: ఎం. హెచ్. స్కూల్ గ్రౌండ్, 7 రోడ్ జంక్షన్
2.విజయనగరం: ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, భాష్యం స్కూల్ వెనుక
3.విశాఖపట్నం: ఆర్కీ బీచ్ , కాళీ మాత టెంపుల్ ఎదురుగా
4. కాకినాడ: రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్
5. ఏలూరు: ఇండోర్ స్టేడియం గ్రౌండ్, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా
6. విజయవాడ: ఎం.జి. రోడ్, ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియం
7. గుంటూరు: మాజేటి గురవయ్య హై స్కూల్ గ్రౌండ్
8. ఒంగోలు: జెడ్పీ మినీ స్టేడియం
9. నెల్లూరు: వి.ఆర్. హైస్కూల్ గ్రౌండ్
10. కడప: ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్
11. అనంతపురం: పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పి.టి.సి)
12. కర్నూల్: డి.ఎస్. ఏ. స్టేడియం
13. తిరుపతి: కె.వి.ఎస్. స్పోర్ట్స్ పార్క్, తుమ్మలకుంట గ్రౌండ్