తొలి మ్యాచ్‌లకు షమీని ఎందుకు దూరం పెట్టారో మౌనం వీడిన రోహిత్
ప్రపంచ కప్ 2023 తొలి మ్యాచ్‌లకు మహ్మద్ షమీని దూరంగా ఉంచాలనే నిర్ణయం చాలా కష్టతరమైందని
By Medi Samrat Published on 19 Nov 2023 12:53 PM ISTప్రపంచ కప్ 2023 తొలి మ్యాచ్‌లకు మహ్మద్ షమీని దూరంగా ఉంచాలనే నిర్ణయం చాలా కష్టతరమైందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. షమీ.. మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలకు ప్రతీ మ్యాచ్‌లో సహాయం చేస్తున్నాడు. 33 ఏళ్ల షమీకి టోర్నమెంట్ ప్రారంభంలో మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం రాలేదు. హార్దిక్ పాండ్యా గాయపడి టోర్నీకి దూరమవడంతో షమీకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
ప్రస్తుతం 2023 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మహమ్మద్ షమీ నిలిచాడు. షమీ ఆరు మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్ తొలి మ్యాచ్‌ల్లో షమీ ఆడకపోవడం చాలా కష్టతరమైన నిర్ణయమని రోహిత్ శర్మ అంగీకరించాడు.
రోహిత్ మాట్లాడుతూ.. 'మా సీనియర్ బౌలర్లలో ఒకడు. అతడు ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్‌లలో ఆడకపోవడం చాలా కష్టమైంది. కానీ అతను ఎల్లప్పుడూ జట్టుకు అండగా నిలిచాడు. సిరాజ్, బుమ్రాకు అన్ని విధాలుగా సహాయం చేయడానికి అతను ఉన్నాడు. జట్టు కోసం అతను చేసిన ప్రదర్శన.. అతను ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నాడో తెలియజేస్తుందని.. జట్టు మేనేజ్‌మెంట్ షమీకి స్పష్టమైన సందేశం ఇచ్చిందని రోహిత్ చెప్పాడు. అతను ప్రారంభ మ్యాచ్‌లకు ఎందుకు దూరమయ్యాడనే దాని గురించి మేము అతనితో మాట్లాడామని తెలిపాడు.
ప్రపంచకప్‌కు ముందు.. ప్రస్తుతం షమీ ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నాడో దీన్ని బట్టి అర్థమవుతోందని రోహిత్ అన్నాడు. టీమ్‌లో భాగం కాకపోవడం షమీకి క్లిష్టమైన సమయం.. కానీ ఆ తర్వాత టీమ్‌లోకి వచ్చి తమతో కలిసి పని చేయడం అంత సులభం కాదు. వరుస ప్రదర్శనలే అతని గురించి చాలా చెబుతాయన్నాడు.