ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ లో డికాక్ సెంచరీ బాదడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో గ్లేన్ మ్యాక్స్‌వెల్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, జోష్ హజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు. సఫారీ బ్యాటర్లలో బవుమా 35, వాన్ డెర్ డ్యూసెన్ 26 పరుగులు చేశాడు. క్లాసేన్ 29, మిల్లర్ 17, మార్కో జెన్సెన్ 26 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్ లో క్వింటన్ డికాక్ (106 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 109) సూపర్ గాయం లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన డికాక్.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ సెంచరీ నమోదు చేశాడు. ప్రపంచ కప్ లో వరుసగా రెండు సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వచ్చే మ్యాచ్ లలో డికాక్ ఎలా ఆడుతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ ప్రపంచ కప్ తర్వాత వన్డేలకు డికాక్ వీడ్కోలు పలకనున్నాడు.