గువహాటి వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. టాస్ పడడం మాత్రమే తర్వాత హోరు వాన పడింది. వర్షం ఎంత వరకూ తగ్గకపోవడంతో వామప్ మ్యాచ్‍ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు అంపైర్లు. టాస్ గెలిచి భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నా.. వాన వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే ఈ మ్యాచ్ రద్దవడం విశేషం. భారత ఆటగాళ్లంతా పూర్తి ఫిట్‍నెస్‍తోనే ఉన్నారని ఈ మ్యాచ్ టాస్ సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
ఇక వరల్డ్ కప్ డిఫెండింగ్ చాంపియన్ టీమ్ ఇంగ్లండ్ 38 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత భారత్‍కు శుక్రవారం చేరుకుంది. చాలా ఇబ్బందికరంగా సాగిందని ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో తెలిపాడు.ఇక అక్టోబర్ 2న బంగ్లాదేశ్‍తో గువహటిలోనే మరో వామప్ మ్యాచ్ ఆడనుంది ఇంగ్లండ్. భారత్, నెదర్లాండ్ మధ్య అక్టోబర్ 3న తిరువనంతపురంలో వామప్ మ్యాచ్ జరగనుంది.