మ్యాక్స్‌వెల్‌ను ఆరుపదాలతో అద్భుతంగా పొగిడిన కోహ్లీ.. పోస్ట్ వైరల్..!
గ్లెన్ మాక్స్‌వెల్ మంగళవారం ఆఫ్ఘనిస్తాన్‌పై ప్రపంచ కప్ చరిత్రలోనే గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు.
By Medi Samrat Published on 8 Nov 2023 2:15 PM ISTగ్లెన్ మాక్స్‌వెల్ మంగళవారం ఆఫ్ఘనిస్తాన్‌పై ప్రపంచ కప్ చరిత్రలోనే గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. గ్లెన్ మాక్స్‌వెల్ వాంఖడే స్టేడియంలో నొప్పితో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ డబుల్ సెంచరీ చేసి ఆస్ట్రేలియాను సెమీ-ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అఫ్గానిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 201* పరుగులు చేసిన గ్లెన్ మాక్స్‌వెల్ కంగారూ జట్టు విజయానికి వీరుడు.
గ్లెన్ మాక్స్‌వెల్ ఇన్నింగ్స్ భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లిని బాగా ఆకట్టుకుంది. దీంతో కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మ్యాక్స్‌వెల్‌ను ప్రశంసించాడు. మాక్స్‌వెల్ ఫోటోను షేర్ చేస్తూ.. 'నీవు మాత్రమే ఇలా చేయగలవు'.. క్రేజీ ఇన్నింగ్స్..! అని క్యాప్షన్ రాశాడు.
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ కలిసి ఆడతారు. ఇద్దరి మధ్య చాలా గాఢమైన స్నేహం ఉంది. మ్యాక్స్‌వెల్ వన్డే చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించి రికార్డ్ సృష్టించాడు.
ఇక విరాట్ కోహ్లీ కూడా భారీ రికార్డుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 49 వన్డే సెంచరీలు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. కోహ్లీ తన తదుపరి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌లో 50వ సెంచరీ సాధించడం ద్వారా ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలవాలని ఆశిస్తున్నాడు.