వచ్చే ప్రపంచకప్‌లో కనపడని స్టార్ ఆటగాళ్లు వీరే..!
ప్రపంచవ్యాప్తంగా వన్డే ప్రపంచకప్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ అభిమాన ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనను
By Medi Samrat Published on 10 Nov 2023 8:17 PM ISTప్రపంచవ్యాప్తంగా వన్డే ప్రపంచకప్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ అభిమాన ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనను అభిమానులు వీక్షిస్తున్నారు. అదే సమయంలో ఈ ప్రపంచ కప్ తర్వాత అభిమానులు కొంచెం షాక్‌కు కూడా గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది అన్ని జట్లలోని చాలా మంది పెద్ద ఆటగాళ్లకు చివరి ODI ప్రపంచ కప్ కావచ్చు. అంటే 2027 వన్డే ప్రపంచకప్‌లో మీరు ఆ ఆటగాళ్లను చూడబోరని అర్థం. వీరిలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ వంటి జట్ల ఆటగాళ్లు ఉన్నారు.
1. రోహిత్ శర్మ
ప్రస్తుత టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచకప్ 2023లో తనదైన ముద్ర వేస్తున్నాడు. అతని కెప్టెన్సీలో టీం ఇండియా అద్భుతంగా రాణిస్తోంది. సెమీ ఫైనల్‌కు కూడా చేరుకుంది. ఇప్పుడు జట్టు ప్రపంచ కప్ 2023 టైటిల్‌కు బలమైన పోటీదారుగా ఉంది. రోహిత్ శర్మకు ఇదే చివరి వన్డే ప్రపంచకప్ కావచ్చని అంటున్నారు. రోహిత్ వయస్సు 36 సంవత్సరాలు. 2027 నాటికి 40 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 2027 వన్డే ప్రపంచకప్ ఆడడం చాలా కష్టం.
2. విరాట్ కోహ్లీ
ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి కూడా అధ్భుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వయసు 34 ఏళ్లు కాగా, 2027 నాటికి అతని వయసు 38 ఏళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వన్డే ప్రపంచకప్‌ను కూడా అతడికి ఆఖరిదిగా పరిగణిస్తున్నారు. విరాట్ ఫిట్‌నెస్ చాలా బాగుందని భావించినందున.. అతను తదుపరి వన్డే ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలున్నాయి.
3. కేన్ విలియమ్సన్
న్యూజిలాండ్ జట్టు ప్రస్తుత కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయాలతో సతమతమవుతున్నాడు. అతడు జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాడు. ప్రస్తుతం విలియమ్సన్ వయస్సు 34 సంవత్సరాలు. అందువల్ల అతడి ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది అతని చివరి ODI ప్రపంచ కప్‌గా కూడా పరిగణించబడుతుంది.
4. డేవిడ్ వార్నర్
ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. తొలి మ్యాచ్‌లలో పేలవమైన ఫామ్‌తో పోరాడిన వార్నర్ తర్వాత మంచి ఫామ్‌ను సాధించాడు. సమాచారం ప్రకారం.. వార్నర్ ఈ ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌లోని మూడు ఫార్మాట్ల నుండి రిటైర్ చెప్పే అవకాశముంది.