గతం అనేది అప్రస్తుతం.. సెమీస్ మ్యాచ్‌కు ముందు రోహిత్ స్టేట్‌మెంట్ ఇదే..!
నవంబరు 15న న్యూజిలాండ్ తో భారత జట్టు వరల్డ్ కప్ సెమీస్ ఆడనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో
By Medi Samrat Published on 14 Nov 2023 3:15 PM GMTనవంబరు 15న న్యూజిలాండ్ తో భారత జట్టు వరల్డ్ కప్ సెమీస్ ఆడనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఈ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. గత వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ చేతిలోనే సెమీస్ మ్యాచ్ ఓడిపోవడంతో ఈ మ్యాచ్ ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని భారత క్రికెట్ జట్టు అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. సెమీఫైనల్ ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెమీస్ మీడియాతో మాట్లాడాడు. ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ పై టీమిండియా ట్రాక్ రికార్డు ఏమంత బాగాలేదన్న విషయంపై స్పందించాడు. ఐసీసీ ఈవెంట్లలో ఇప్పటివరకు టీమిండియా, న్యూజిలాండ్ 13 సార్లు తలపడగా.. న్యూజిలాండ్ జట్టు 9 మ్యాచ్ ల్లో నెగ్గింది. ఈ విషయాన్ని పట్టించుకోవద్దని రోహిత్ శర్మ చెప్పాడు. గత వరల్డ్ కప్ లో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో ఓడిందన్న విషయాన్ని మర్చిపోవాలని అన్నాడు. గత ఐదేళ్లలో ఏం జరిగింది.. గత పదేళ్లలో ఏం జరిగింది.. అనేది అప్రస్తుతం అని స్పష్టం చేశాడు. తమ దృష్టంతా సెమీస్ మ్యాచ్ పైనే ఉందని స్పష్టం చేశాడు.
ప్రస్తుతం జరుగుతున్న మెగా టోర్నమెంట్ లో లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది భారత్. 1983, 2011 ఛాంపియన్ అయిన భారత్ ను మరోసారి సెమీస్ లో ఓడించడానికి న్యూజిలాండ్ తహతహలాడుతూ ఉంది. అయితే భారత బ్యాటింగ్ లైనప్ మంచి ఫామ్ లో ఉంది. కెప్టెన్ రోహిత్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలతో కూడిన పేస్ త్రయం ప్రత్యర్థులకు ఇబ్బందులు పెడుతోంది. స్పిన్ ద్వయం కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కూడా ప్రత్యర్థిని తెగ టెన్షన్ పెడుతున్నారు.