భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కు అంపైర్లు ఎవరో తెలుసా?

ఐసీసీ ప్రపంచ కప్ లో సెమీఫైనల్ మ్యాచ్ లు, ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలాయి.

By Medi Samrat  Published on  13 Nov 2023 7:16 PM IST
భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కు అంపైర్లు ఎవరో తెలుసా?

ఐసీసీ ప్రపంచ కప్ లో సెమీఫైనల్ మ్యాచ్ లు, ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలాయి. నవంబర్ 15, 16 తేదీల్లో సెమీస్ మ్యాచ్ లు, ఈ నెల 19న ఫైనల్ నిర్వహించనున్నారు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి సెమీఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ కు ఐసీసీ అంపైర్లను ప్రకటించింది. రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ (ఇంగ్లండ్), రాడ్ టకర్ (ఆస్ట్రేలియా) తొలి సెమీఫైనల్లో అంపైర్లుగా వ్యవహరిస్తారని ఐసీసీ వెల్లడించింది. వెస్టిండీస్ కు చెందిన జోయెల్ విల్సన్ థర్డ్ అంపైర్ గానూ, దక్షిణాఫ్రికాకు చెందిన ఆడ్రియన్ హోల్డ్ స్టాక్ ఫోర్త్ అంపైర్ గానూ వ్యవహరిస్తారని వివరించింది. జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ ఈ తొలి సెమీఫైనల్ కు మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తారు. భారతదేశం, న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ-ఫైనల్ పోరు రాడ్ టక్కర్ కు 100వ ODI మ్యాచ్ కావడం విశేషం.

Next Story