ప్రపంచకప్‌కు ముందు ఆ బౌలర్ ఫామ్‌పై రాబిన్ ఉతప్ప ఆందోళన
ప్రపంచకప్‌కు టీమిండియా సిద్ధమైంది. అక్షర్ పటేల్‌ను తప్పించి అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు
By Medi Samrat
ప్రపంచకప్‌కు టీమిండియా సిద్ధమైంది. అక్షర్ పటేల్‌ను తప్పించి అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించడంతో తుది జట్టును ఖరారు చేశారు. అయితే కొంత మంది ఆటగాళ్ల ఫామ్ దారుణంగా ఉన్నందున భారత జట్టు ఆందోళన తగ్గడం లేదు. వారిలో శార్దూల్ ఠాకూర్ ఒకరు. ప్రపంచకప్‌లో శార్దూల్ ఠాకూర్ టీమ్ ఇండియాకు 'ఆందోళన' కలిగించగలడని భారత జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డాడు.
శార్దూల్ వికెట్ టేకింగ్ బౌలర్ అని, అయితే అతని ఎకానమీ ప్రపంచకప్‌లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఉతప్ప చెప్పాడు. శార్దూల్ వికెట్లు తీయడంలో నిష్ణాతుడే అయినప్పటికీ పరుగులు ఆపడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నాడు. ప్రపంచ కప్‌లో శార్దూల్ భారత్‌కు పెద్ద ఆస్తిగా ఉంటాడని.. అతని మెరుగైన బ్యాటింగ్ నైపుణ్యం కారణంగా జట్టు మేనేజ్‌మెంట్ అతనిని మహ్మద్ సిరాజ్ లేదా మహ్మద్ షమీ స్థానంలో ఎంపిక చేయగలదని ఊతప్ప చెప్పాడు.
ఉతప్ప మాట్లాడుతూ.. శార్దూల్ ఠాకూర్ టీమ్ ఇండియాకు ఆందోళన కలిగించే విషయం. అతను వికెట్లు తీస్తాడు. నాణ్యమైన బౌలర్.. కానీ అతని గురించి ఒక విషయం ఏమిటంటే.. అతను చాలా పరుగులు ఇచ్చాడు. భారత పిచ్‌లపై దారాళంగా పరుగులిస్తాడు. ఇది మేనేజ్‌మెంట్ శ్రద్ధ వహించాల్సిన విషయం. CSK లో మేము అతనిని గోల్డెన్ ఆర్మ్ అని పిలుస్తాము. అతని పాత్ర భారత జట్టుకు కూడా అదే విధంగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. తన అనుభవంతో అశ్విన్ చాలా ప్రమాదకరమైన బౌలర్‌గా మారబోతున్నాడని ఉతప్ప చెప్పాడు. ప్రపంచకప్‌లో జట్టులోకి ఎంపిక కాకపోవడం నుంచి ఆస్ట్రేలియా సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడం వరకు అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశాడు.