వ‌రుస ఓట‌ముల త‌ర్వాత‌ విజ‌యం సాధించిన పాక్‌

ప్రపంచకప్-2023లో భాగంగా జ‌రిగిన‌ 31వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

By Medi Samrat  Published on  31 Oct 2023 3:52 PM GMT
వ‌రుస ఓట‌ముల త‌ర్వాత‌ విజ‌యం సాధించిన పాక్‌

ప్రపంచకప్-2023లో భాగంగా జ‌రిగిన‌ 31వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన‌ ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ టాస్ గెలిచి తొలుత‌ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన‌ బంగ్లాదేశ్ జట్టు 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. అనంత‌రం చేధ‌న‌కు దిగిన‌ పాకిస్థాన్ 32.3 ఓవర్లలో మూడు వికెట్లకు 205 పరుగులు చేసి విజయం సాధించింది.

బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్థాన్ టోర్నీలో సెమీస్‌ ఆశ‌ల‌ను సజీవంగా నిలుపుకుంది. ఈ ఓటమి తర్వాత బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఏడు మ్యాచ్‌లు ఆడిన బంగ్లా కేవ‌లం ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. పాకిస్థాన్ ఏడు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో గెలిచి ఆరు పాయింట్లను కలిగి ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే పాక్‌కు సెమీఫైనల్ అవ‌కాశాలు కూడా ఉన్నాయి.

బంగ్లాదేశ్ జట్టు 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 32.3 ఓవర్లలో మూడు వికెట్లకు 205 పరుగులు చేసి విజయం సాధించింది. పాకిస్థాన్ తరఫున ఫఖర్ జమాన్ అత్యధికంగా 81 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అబ్దుల్లా షఫీక్ 68 పరుగులు చేశాడు. మహ్మద్ రిజ్వాన్ 26, ఇఫ్తికర్ అహ్మద్ 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 9 పరుగుల వద్ద కెప్టెన్ బాబర్ అజామ్ ఔటయ్యాడు. బంగ్లాదేశ్‌ తరఫున మెహదీ హసన్‌ మిరాజ్‌ మూడు వికెట్లు తీశాడు.

అంతకుముందు బంగ్లాదేశ్ తరఫున మహ్మదుల్లా(56) అత్యధిక పరుగులు చేశాడు. లిటన్ దాస్ 45 పరుగులు, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 43 పరుగులు, మెహదీ హసన్ మిరాజ్ 25 పరుగులు చేసి ఔట్ అయ్యారు. పాక్ బౌలర్లలో మహ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది చెరో మూడు వికెట్లు తీశారు. హరీస్ రవూఫ్ రెండు వికెట్లు తీయ‌గా.. ఇఫ్తికర్ అహ్మద్, ఉసామా మిర్ చెరో వికెట్ తీశారు.

Next Story