ఫైన‌ల్‌లో భార‌త్ 65 ప‌రుగుల‌కే ఆలౌట్ అవుతుంద‌ట‌.. స్టార్ క్రికెట‌ర్ జోస్యం..!

ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది.

By Medi Samrat  Published on  17 Nov 2023 2:21 PM GMT
ఫైన‌ల్‌లో భార‌త్ 65 ప‌రుగుల‌కే ఆలౌట్ అవుతుంద‌ట‌.. స్టార్ క్రికెట‌ర్ జోస్యం..!

ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు ఓ స్టార్ క్రికెటర్ జోస్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐసీసీ ప్రపంచ కప్-2023 ఫైనల్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతుందని వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ముందే ఆ స్టార్ జోస్యం చెప్పాడు. ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 450 పరుగులు చేస్తుందని.. దీనికి బ‌దులుగా భారత జట్టు కేవలం 65 పరుగులు మాత్ర‌మే చేసి ఆలౌట్ అవుతుందని ఆ స్టార్ ప్లేయర్ షాకింగ్ జోస్యం చెప్పాడు.

ఐపీఎల్ సమయంలో ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ ఈ అంచనా వేశాడు. 2023 ఐపీఎల్‌ సీజన్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహించిన పోడ్‌కాస్ట్ షోలో మాట్లాడుతూ.. మార్ష్ ఈ జోస్యం చెప్పాడు. ఫైనల్‌లో భారత్‌తో ఆస్ట్రేలియా తలపడుతుందని మార్ష్ జోస్యం చెప్పాడు. అయితే.. ఫైనల్‌లో భారత్‌ను కేవలం 65 పరుగులకే పరిమితం చేసి.. ఆస్ట్రేలియా 385 పరుగుల తేడాతో గెలుస్తుందని మార్ష్ చెప్పాడు.

మిచెల్ మార్ష్ అంచనా ఒకటి ఇప్పటికే నిజమైంది. భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. కాబట్టి మిచెల్ రెండో అంచనా కూడా నిజమవుతుందేమోన‌ని అభిమానులు భయపడుతున్నారు. ఈ ప్రపంచకప్‌లో భారత్‌ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడిస్తే ఐసీసీ ప్రపంచకప్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా అవతరిస్తుంది. ఈ విజయంతో భారత జట్టు ఆస్ట్రేలియాతో సమానంగా నిలవనుంది.

Next Story